North Korea:ప్రపంచం నెత్తిన కిమ్ బాంబ్: ప్రత్యర్థులపై శివంగిలా : భరతం పడతా..!!

ప్యాంగ్యాంగ్: కిమ్ జాంగ్ ఉన్... ఈ పేరు వింటే అగ్రరాజ్యాలు సైతం గజగజ వణికిపోతాయి.. ఈ ఉత్తరకొరియా అధ్యక్షుడు సీతయ్య కంటే దారుణంగా వ్యవహరిస్తారు. ఎవరి మాట వినకపోగా చేసే దారుణాలు గురించి తెలుసుకుంటే మాత్రం ఒళ్లు కంపరమెక్కుతుంది. ఒక వ్యక్తికి కరోనా సోకిందనే చిన్న అనుమానం వస్తే చాలు... కరోనాతో అతను మృతి చెందేవరకు వెయిట్ చేయడు.. అంతకంటే ముందే పని ముగించేస్తాడు కిమ్ అనే ఈ నియంత. ఇక కిమ్ అత్యంత ప్రమాదకరమైన అణుక్షిపణులను ప్రయోగించి మళ్లీ చాలా కాలం తర్వాత వార్తల్లో నిలిచాడు. ఇక గతేడాది కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ కూడా వార్తల్లో నిలిచారు. ఆమె కిమ్ కంటే మరింత ప్రమాదకారి అని అంతర్జాతీ అంశాలపై అవగాహన ఉన్న విశ్లేషకులు చెబుతుంటారు. ఇప్పుడు కిమ్ యో జాంగ్ మళ్లీ హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు...

 ప్రమోషన్ పొందిన కిమ్ యో జాంగ్

ప్రమోషన్ పొందిన కిమ్ యో జాంగ్

ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నది కిమ్ యో జాంగ్. ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ సోదరి. ప్రస్తుతం కిమ్ యో జాంగ్ తన అన్న కిమ్ జాంగ్ ఉన్‌కు అన్ని విధాలా సహకారం అందిస్తోంది. తాజాగా కిమ్ యో జాంగ్‌ పనితీరును మెచ్చి నియంత కిమ్ ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ అంటే అల్లా టప్పా ప్రమోషన్ కాదండోయ్... ఏకంగా దేశంలో అమలయ్యే నిర్ణయాలకు అధినేత్రిగా నియమించాడు. అంటే ఆ కమిటీకి ఆమె బాస్ అన్నట్లు. ఇక కిమ్ యో జాంగ్ నియామకాన్ని అత్యంత దగ్గరగా పరిశీలిస్తున్నాయి ప్రపంచ అగ్రదేశాలు. ఎందుకంటే ఆమె తీసుకునే నిర్ణయాలు కిమ్ కంటే మరింత కఠినంగా ఉంటాయని టాక్. అన్న ఒక్క ఆకు చదివితే అన్నకు మించి రెండు ఆకులు ఎక్కువే చదివింది సోదరి కిమ్ యో జాంగ్.

 అన్నకు అండగా అన్ని వేళలా...

అన్నకు అండగా అన్ని వేళలా...

ఇప్పటికే కిమ్ జాంగ్ ఉన్‌కు అడ్వయిజర్‌గా సోదరి కిమ్ యో జాంగ్ వ్యవహరిస్తోంది. అయితే తాజా నియామకంతో తొలిసారిగా ఒక అధికారిక కమిటీ స్థానంలో కూర్చుంది. దేశం తీసుకునే కీలక నిర్ణయాలపై ఇక నుంచి ఈ మహిళా అధినేత్రి కిమ్ యో జాంగ్ ముద్ర ఉండనుంది. ఇక కిమ్ యో జాంగ్‌కు సహాయం చేసేందుకు మరో ఏడుగురిని కూడా అధ్యక్షుడు కిమ్ నియమించారు. ఇక ఈ కమిటీలో ఏకైక మహిళగా కిమ్ యో జాంగ్ మాత్రమే ఉన్నారు. ఈ మధ్యనే ఈ కమిటీలోని 9 మంది కీలక వ్యక్తుల్లో కొందరు రిటైర్ కాగా మరికొందరిని కిమ్ జాంగ్ ఉన్ తప్పించారు. తప్పించిన వారిలో దేశ ఆర్థిక వ్యవస్థకు అదే సమయంలో కిమ్ జాంగ్ ఉన్ వ్యక్తిగత ఆర్థిక సలహాదారుడిగా గత పదేళ్ల నుంచి పనిచేస్తున్న 82 ఏళ్ల పాక్ పాంగ్ జు కూడా ఉన్నారు. ఈ మధ్యే ఉత్తరకొరియా ప్రయోగించిన హైపర్ సోనిక్ క్షిపణి పరీక్ష పాక్ పాంగ్ జు నేతృత్వంలోనే జరిగింది.

 ట్రంప్-కిమ్ భేటీలో కీలకంగా..

ట్రంప్-కిమ్ భేటీలో కీలకంగా..

ఇక కిమ్ యో జాంగ్‌ను దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కమిటీకి బాస్‌గా నియమించడం పట్లు పలు వాదనలు వినిపిస్తున్నాయి. ముందుగా తన నీడను తానే నమ్మని నియంత కిమ్ జాంగ్ ఉన్‌ ఎవరినైనా నమ్ముతున్నాడంటే అది తన సోదరి కిమ్ యో జాగ్ కావడం విశేషం. గతేడాది అనారోగ్య కారణంతో కొన్ని రోజుల పాటు కిమ్ జాంగ్ ఉన్ బయటకు రాలేదు. ఆ సమయంలో సోదరి కిమ్ యో జాంగ్ దేశ బాధ్యతలను తీసుకున్నట్లు దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొంది. అంటే పరోక్షంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. అయితే అధికారికంగా దీన్ని ఎవరూ ధృవీకరించలేదు. ఇక 2018లో దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌చాంగ్‌ వేదికగా జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో కిమ్ యో జాంగ్ ఉత్తరకొరియా బృందాన్ని ముందుండి నడిపించింది. అంతేకాదు దక్షిణి కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్-కిమ్ జాంగ్ ఉన్‌ల మధ్య బేటీని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది. ఆ తర్వాత సింగపూర్‌లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కిమ్ జాంగ్ ఉన్ మధ్య జరిగిన సమావేశంలో కూడా తన సోదరుడి పక్కనే కూర్చోవడం కనిపించింది.

 అన్న కంటే డేంజర్‌గా చెల్లి

అన్న కంటే డేంజర్‌గా చెల్లి

ఇక ఈ మధ్యకాలంలో పలు కీలక ప్రకటనలు చేస్తూ ప్రపంచ దేశాల దృష్టిని తన వైపు మరల్చుకుంటోంది కిమ్ యో జాంగ్. ముఖ్యంగా బైడెన్ పరిపాలన పై కామెంట్స్ చేయడం, ఉత్తరకొరియా చేస్తున్న క్షిపణి ప్రయోగాలను సమర్థించుకోవడం, అదే సమయంలో ఇతర దేశాలతో సత్సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ ఇటు అంతర్జాతీయ మీడియానే కాకుండా ఇతర దేశాల నాయకుల దృష్టి కూడా ఆకట్టుకునేలా వ్యవహరిస్తోంది. ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య యుద్ధానికి తన సోదరుడు కిమ్ జాంగ్ ఉన్ ముగింపు పలకాలంటే ముందుగా అమెరికా దక్షిణ కొరియాలు తమ దేశంపై అనుసరిస్తున్న విధానాలను నిలిపివేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడమే కాదు హెచ్చరికలు కూడా జారీ చేసింది.

మొత్తానికి కిమ్ యో జాంగ్‌కు కీలక పదవి కట్టబెట్టడంతో ఇక ఆమె మార్క్ పాలన స్టార్ట్ అవుతుందని పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఆమె తన సోదరుడు కిమ్ జాంగ్ ఉన్ కంటే ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+