వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్ నిజంగా అంత సాహసం చేశాడా?: ఫోటోలు విడుదల చేసిన ఉ.కొరియా..

|
Google Oneindia TeluguNews

ప్యోంగ్‌యాంగ్: ఉత్తరకొరియా పాలకులను అక్కడి ప్రజలు మానవాతీతులుగా భావించే విషయాలు అక్కడ చాలానే ప్రచారంలో ఉన్నాయి. దానికి తగ్గట్లే అక్కడి మీడియా కూడా వ్యవహరిస్తుంటుంది.

తాజాగా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కు సంబంధించి ఓ ఆసక్తికర వార్తను ఉత్తరకొరియా మీడియా వెల్లడించింది. 8,300 అడుగుల ఎత్తున్న పేక్టు పర్వతాన్ని కిమ్ జాంగ్ మరోసారి ఎక్కినట్లు తెలిపింది. అయితే అంతెత్తు పర్వతం ఎక్కినా.. కిమ్ 'షూ'పై ఇసుమంతైనా మంచు అంటకపోవడం ఇప్పుడు అనేక ప్రశ్నలు లేవనెత్తేలా చేసింది.

పర్వతంపై కిమ్ ఫోటోలు :

పర్వతంపై కిమ్ ఫోటోలు :

కిమ్ పర్వతాన్ని ఎక్కాడు అనడానికి సాక్ష్యంగా అక్కడి మీడియా కొన్ని ఫోటోలను విడుదల చేసింది. అయితే అంతెత్తు మంచు కొండను ఎక్కినా.. అతని ముఖంలో ఎలాంటి అలసట కనిపించకపోవడం.. బూట్లకు మంచు కూడా అంటుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పర్వతంపై కిమ్ జాంగ్ తాత జన్మించినట్లు.. ఆ సమయంలో ఆకాశంలో రెండు ఇంధ్రదనుస్సులు ఏర్పడినట్లు అక్కడో ప్రచారం ఉంది.

'రుతుస్రావం'.. కొన్ని కఠిన నిజాలు: ఉ.కొరియాలో మహిళా సైనికుల దీనగాథ.. స్నానం చేయాలన్నా!'రుతుస్రావం'.. కొన్ని కఠిన నిజాలు: ఉ.కొరియాలో మహిళా సైనికుల దీనగాథ.. స్నానం చేయాలన్నా!

 నిజంగా అంత సాహసం చేశాడా?

నిజంగా అంత సాహసం చేశాడా?

మూడేళ్లకు కిమ్ జాంగ్ డ్రైవింగ్ నేర్చుకున్నారన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో.. నిజంగా కిమ్ జాంగ్ ఇంత సాహసం చేసి ఉంటాడా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. చూడటానికి చబ్బీగా.. నిధానంగా నడిచే వ్యక్తిలా కనిపించే కిమ్ జాంగ్.. అంతెత్తు పర్వతాన్ని ఎక్కడం నిజంగా సాధ్యమేనా?.., వాస్తవాలు అక్కడి మీడియాకు, కిమ్ జాంగ్ కే తెలియాలి అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నమ్మలేని నిజాలు?: ప్రపంచానికి తెలియని 'ఉ.కొరియా' ఇది.., అంతా ఆశ్చర్యమే!నమ్మలేని నిజాలు?: ప్రపంచానికి తెలియని 'ఉ.కొరియా' ఇది.., అంతా ఆశ్చర్యమే!

 హోటల్ నిర్మాణమా?:

హోటల్ నిర్మాణమా?:

ఇంతకీ ఇప్పుడు కిమ్ జాంగ్ పేక్టు పర్వతం ఎందుకు ఎక్కినట్లు అని ఆరా తీస్తే.. అక్కడో హోటల్ నిర్మించాలనే ప్రయత్నంలో ఉన్నారట. ఇందుకోసం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారని తెలుస్తోంది. అయితే ఇక్కడ హోటల్ నిర్మాణం ఎందుకనే దానిపై కూడా స్పష్టత లేదు.

ఇదొక్కటి చాలు: ఉ.కొరియాలో ప్రజల దుస్థితి చెప్పడానికి, ఆఖరికి చావులోను..ఇదొక్కటి చాలు: ఉ.కొరియాలో ప్రజల దుస్థితి చెప్పడానికి, ఆఖరికి చావులోను..

 దాని పక్కనే అగ్నిపర్వతం:

దాని పక్కనే అగ్నిపర్వతం:

చైనా సరిహద్దులో ఉన్న పేక్డు పర్వతాన్ని ఉత్తరకొరియన్లు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ పర్వతానికి సమీపంలోనే మరో ప్రమాదకర అగ్నిపర్వతం కూడా ఉంది. ఉ.కొరియా ప్రయోగాల నేపథ్యంలో ఈ అగ్నిపర్వతం ఎక్కడ బద్దలవుతుందోనన్న ఆందోళన కూడా ఉంది. 1000ఏళ్ల క్రితం ఈ పర్వతం బద్దలైనప్పుడు.. ఆ బూడిదంతా ఉత్తర జపాన్ ప్రాంతాన్ని కమ్మేసినట్లు చెబుతారు.

English summary
North Korean state media has made another dubious claim about Kim Jong-un's 'superhuman powers' after insisting the overweight tyrant had climbed an 8,000ft mountain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X