ఉ.కొరియా దెబ్బ: హైడ్రోజన్ బాంబుకు కుప్పకూలిన పర్వతం
ప్యాంగ్యాంగ్: అణుపరీక్షలు, క్షిపణుల పరీక్షలతో ప్రపంచాన్ని ఉత్తరకొరియా వణికిస్తోంది. ఇటీవల ఉత్తరకొరియా పరీక్షించిన హైడ్రోజన్ బాంబు శక్తి మామూలుది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు, ఈ బాంబు దెబ్బకు పర్వతాలు కుప్పకూలిపోయిందని నిపుణులు ప్రకటించారు.
గత ఆదివారం రోజున ఉత్తర కొరియా ప్యుంగే-రి ప్రాంతంలో హైడ్రోజన్ బాంబును పరీక్షించింది.ఈ బాంబు శక్తి మామూలుగా లేదని '38 నార్త్' అనే విశ్లేషణ సంస్థ పేర్కొంది. దాని దెబ్బకు కొండలు పిండి అయిపోయాయని తెలిపింది.
ఆ ప్రాంతంలో తీసిన తాజా చిత్రాలను గత చిత్రాలతో పోల్చి చూసినప్పుడు ఈ విషయం బయటపడిందని సంస్థ పేర్కొంది. బాంబు దెబ్బకు కొండచరియలు విరిగిపడ్డాయని, ఆ ప్రాంతం చిందరవందరగా మారిందని సంస్థ వివరించింది.

ప్యుంగే-రి ప్రాంతంలో ఉత్తర కొరియా మొత్తం ఆరు అణుపరీక్షలు నిర్వహించింది. హైడ్రోజన్ బాంబు పరీక్ష అనంతరం ఆదివారం తర్వాత తీసిన ఈ ప్రాంతంలోని చిత్రాలు బాంబు శక్తిని తెలియజేస్తున్నాయని ప్రకటించింది.
పేలుడు ధాటికి మాన్‌టాప్ పర్వతం దాదాపు ధ్వంసమైందని పేర్కొంది. ఉత్తర కొరియా గత పరీక్షల్లో ఇంతటి విధ్వంసం జరగలేదని '38 నార్త్' వివరించింది.












Click it and Unblock the Notifications