వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రుతుస్రావం'.. కొన్ని కఠిన నిజాలు: ఉ.కొరియాలో మహిళా సైనికుల దీనగాథ.. స్నానం చేయాలన్నా!

|
Google Oneindia TeluguNews

ప్యోంగ్‌యాంగ్: ఉత్తరకొరియా అరాచకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వ్యక్తిగత స్వేచ్చ పూర్తిగా హరించేయబడ్డ ఆ దేశంలో అధ్యక్షుడు చెప్పిందే శిలా శాసనం. అందులో లోపాలు ఉన్నా సరే ఎదురు ప్రశ్నించడానికి లేదు. ప్రశ్నించే ధైర్యం చేసినవారు బతికి బట్టకట్టలేరు.

ఉత్తరకొరియాపై అమెరికా కొత్త ఆంక్షలు!ఉత్తరకొరియాపై అమెరికా కొత్త ఆంక్షలు!

ఉత్తరకొరియా ప్రజల కష్టాలు, వారి బాధల గురించి ఇన్నాళ్లు అంతర్జాతీయ సమాజానికి తెలిసింది చాలా తక్కువ. అగ్రరాజ్యాన్ని ఢీకొట్టడానికి ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ సిద్దపడటం.. హైడ్రోజన్ బాంబు ప్రయోగాలతో ప్రపంచానికే వణుకు పుట్టించడంతో.. ఉత్తరకొరియా గురించి ప్రపంచం ఆసక్తిగా ఆరా తీయడం మొదలైంది.

ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు ఎంతటి ధీనావస్థలో మగ్గిపోతున్నారో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. కిమ్ ఆటవిక పాలనలో అక్కడి సైన్యంలో జరుగుతున్న అరాచకాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గతంలో సైన్యంలో పనిచేసి అక్కడి నుంచి దక్షిణ కొరియా పారిపోయిన లీ సో యియోన్ అనే మహిళ తాజాగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

18ఏళ్లు నిండగానే:

18ఏళ్లు నిండగానే:

1992-2001 మధ్య కాలంలో పదేళ్ల పాటు ఉత్తరకొరియా సైన్యంలో యియోన్ సేవలందించారు. 18ఏళ్ల వయసొచ్చిన యువతులు సైన్యంలో చేరడం అక్కడ తప్పనిసరి. కేవలం స్పోర్ట్స్, మ్యూజిక్ వంటి రంగాల్లో ప్రతిభ చూపించేవారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. మిగతా యువతులంతా 18ఏళ్లు వచ్చాయంటే తమవంతుగా సైన్యానికి సేవలందించడానికి సిద్దమైపోవాల్సిందే.

ఆగిపోతున్న రుతుస్రావాలు:

ఆగిపోతున్న రుతుస్రావాలు:

ఉత్తరకొరియా సైన్యంలో మహిళా సైనికులు అత్యంత దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారు. పౌష్టికాహార లోపం, తీవ్రమైన ఒత్తిడి కారణంగా సైన్యంలో చేరిన ఆరు నెలలకే వారు 'రుతుస్రావం' కోల్పోతున్నారు. ఒక్కో యువతికి రెండేళ్లకు ఒకసారి మాత్రమే రుతుస్రావం అవుతున్న పరిస్థితి.

రుతుస్రావం-దుర్భర పరిస్థితుల్లో మహిళలు:

రుతుస్రావం-దుర్భర పరిస్థితుల్లో మహిళలు:

ఇలా ఏళ్ల తరబడి రుతుస్రావం జరగకపోవడం పట్ల అక్కడి మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అయితే దీని వెనకాల వారి ఆవేదన కూడా ఉంది. ఉత్తరకొరియాలో ఇప్పటికీ సాంప్రదాయ కాటన్ సానిటరీ ప్యాడ్స్ మాత్రమే ఉపయోగిస్తారు. సైన్యంలో పనిచేసే మహిళలు ఒకసారి ఉపయోగించిన వాటినే మళ్లీ ఉపయోగించాల్సిన దుస్థితి ఇక్కడ నెలకొంది.

పైగా చుట్టూ మగవారు లేని సమయాల్లోనే వాటిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. దానికి తోడు మహిళా సైనికులు స్నానం చేయడానికి సరైన ఏర్పాట్లు కూడా ఉండవు. అంతకుమించి సైన్యాధికారుల చేతిలో అత్యాచారాలు ఇక్కడ నిత్యకృత్యం.

వారి చేత గర్భం దాల్చకుండా ఉండాలంటే రుతుస్రావం రాకపోవడమే మంచిదనేది వారి అభిప్రాయం. 'నార్త్ కొరియా ఇన్ 100క్వెషన్' పుస్తకంలో రచయిత జూలియట్ ఈ విషయాలను వెల్లడించారు.

ద.కొరియాలో మాత్రమే కనిపించే కల్చర్స్: టాప్-5 షాకింగ్ విషయాలు..ద.కొరియాలో మాత్రమే కనిపించే కల్చర్స్: టాప్-5 షాకింగ్ విషయాలు..

 అత్యాచారాలపై లీ యియోన్:

అత్యాచారాలపై లీ యియోన్:

ప్రస్తుతం 41ఏళ్ల వయసున్న లీ సీ యియోన్ సైన్యంలో అత్యాచారాల గురించి కూడా వివరించారు. సైనిక కమాండర్ మహిళా సైనికులపై అత్యాచారం జరపడం ఇక్కడ అత్యంత సహజమని చెప్పారు. దీనికి అంతూ పొంతూ అంటూ లేదని, సైన్యంలో ఉన్నన్ని రోజులు మహిళా సైనికులు అత్యాచారాలకు గురవుతూనే ఉంటారని తెలిపారు. అయితే అదృష్టవశాత్తు తాను మాత్రం అత్యాచారానికి గురవలేదని పేర్కొనడం గమనార్హం.

ప్రపంచానికి తెలియని 'సీక్రెట్స్': ద.కొరియా-ఉ.కొరియాకు ఇదీ తేడా!, ఎక్కువకాలం బతికేది వాళ్లే..ప్రపంచానికి తెలియని 'సీక్రెట్స్': ద.కొరియా-ఉ.కొరియాకు ఇదీ తేడా!, ఎక్కువకాలం బతికేది వాళ్లే..

 స్నానం కూడా చేయలేని దుస్థితి:

స్నానం కూడా చేయలేని దుస్థితి:

20ఏళ్ల ఉత్తరకొరియా మహిళా సైనికురాలితో ఓసారి జూలియట్ మాట్లాడారట. ఆ సందర్భంగా ఆమె విస్తుపోయే విషయాలు చెప్పిందని ఆయన పేర్కొన్నారు. సైన్యంలో భాగంగా చాలా కఠినమైన శిక్షణ ఉంటుందని, అలాంటి శిక్షణ తీసుకున్న తర్వాత తనకు రెండేళ్లకు గానీ రుతుస్రావం జరగట్లేదని ఆమె వాపోయిందట.

అంతేకాదు, ఇక్కడి ఆర్మీ బంకులు బియ్యం పొట్టుతో తయారుచేసినవి కావడం వల్ల ఆఖరికి తమ చెమట కూడా తీవ్ర దుర్గంధం వచ్చేదని యియోన్ తెలిపారు.

'ఒక మహిళ స్నానం చేయకుండా ఉండాల్సి రావడమనేది అత్యంత ఇబ్బందికరమైన విషయం. కానీ మేము పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాల్సి వచ్చేది. అక్కడి బాత్రూమ్ లలో కప్పలు, పాములు వంటివి సంచరిస్తుంటాయి. కనీసం వేడి నీళ్ల సౌకర్యం కూడా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో స్నానం చేయడమనేది దుర్భరంగా ఉండేది' అంటూ యియోంగ్ తన ఆవేదన వ్యక్తం చేశారు.

'20ఏళ్ల కెరీర్‌లో ఇలాంటిది చూడలేదు': ఉ.కొరియా సైనికుడి శరీరం నిండా పురుగులే..'20ఏళ్ల కెరీర్‌లో ఇలాంటిది చూడలేదు': ఉ.కొరియా సైనికుడి శరీరం నిండా పురుగులే..

 తప్పించుకున్న యియోన్:

తప్పించుకున్న యియోన్:

18ఏళ్ల వయసులో లీ యియోన్ స్వచ్చందంగా ఉత్తరకొరియా ఆర్మీలో చేరారు. 18ఏళ్లు నిండిన యువతులంతా కనీసం ఏడేళ్ల పాటు సైన్యానికి సేవలందించాలని రెండేళ్ల క్రితమే కిమ్ జాంగ్ ఆదేశాలు జారీ చేశారు. సైన్యంలో 18-25ఏళ్ల మధ్య వయసున్న యువతుల సంఖ్య పెంచడానికే కిమ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.

కాగా, లీ యియోన్ 2008లో సైన్యం నుంచి పారిపోతూ పట్టుబడి ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించింది. ఆ తర్వాత రెండోసారి మాత్రం విజయవంతంగా టర్మెన్ నదిని ఈదుకుంటూ చైనా చేరుకుని అక్కడి నుంచి దక్షిణకొరియా చేరుకుంది. ఇటీవల ఉత్తరకొరియా నుంచి పారిపోతూ అక్కడి సైన్యం చేతిలో తీవ్రంగా గాయపడ్డ ఓ సైనికుడికి దక్షిణ కొరియా ఆశ్రయం కల్పించిన సంగతి తెలిసిందే. అతని శరీరంలో వేలకొద్ది పురుగులు గుర్తించడం తీవ్ర చర్చనీయాంశంగానూ మారింది.

తగ్గకూడదనే!: ఆంక్షల వెనుక కిమ్ వ్యూహమిదే, దెబ్బతీసేందుకు ట్రంప్ కొత్త ఎత్తుగడలు.. తగ్గకూడదనే!: ఆంక్షల వెనుక కిమ్ వ్యూహమిదే, దెబ్బతీసేందుకు ట్రంప్ కొత్త ఎత్తుగడలు..

English summary
Female North Korean soldiers are often raped, and some are forced to reuse sanitary pads while many stop menstruating altogether because of the tough conditions suffered during their army duty, a North Korean defector who dealt with years of hellish service in the regime’s army revealed Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X