వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పతాకస్థాయికి చేరిన ఉద్రిక్తతలు, అమెరికాతో ఇక యుద్ధమే, సన్నాహాలు మొదలెట్టిన ఉత్తరకొరియా

ఏదైతే జరగకూడదని అందరూ భావిస్తున్నారో అదే జరగబోతోంది. ఉత్తర కొరియా పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమైపోతోంది. కొరియా ద్వీపకల్పం సమీపంలో ఎగిరే అమెరికా బాంబర్లను నేలకూలుస్తామని హెచ్చరించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

సియోల్‌: ఏదైతే జరగకూడదని అందరూ భావిస్తున్నారో అదే జరగబోతోంది. ఉత్తర కొరియా పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమైపోతోంది. కొరియా ద్వీపకల్పం సమీపంలో ఎగిరే అమెరికా బాంబర్లను నేలకూలుస్తామని హెచ్చరించింది.

పాక్ లో అణ్వాయుధాల తయారీ, 9 చోట్ల స్థావరాలు, చైనా సహకారం? పసిగట్టిన అమెరికా!పాక్ లో అణ్వాయుధాల తయారీ, 9 చోట్ల స్థావరాలు, చైనా సహకారం? పసిగట్టిన అమెరికా!

మరోపక్క అమెరికా కూడా యుద్ధ సమయంలో తీసుకునే చర్యలు తీసుకుంటోంది. తన వాయుమార్గాల‌ను తెరిచింది. తాజాగా ఉత్తరకొరియాకు చెందిన యుద్ధనౌక ఒకటి దక్షిణ కొరియా సముద్ర జలాల్లో మునిగిపోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

ఉత్తరకొరియాలో కంపించిన భూమి, మరో అణుపరీక్ష!? అది హైడ్రోజన్ బాంబు ఎఫెక్టా? ఇక యుద్ధం తప్పదా?ఉత్తరకొరియాలో కంపించిన భూమి, మరో అణుపరీక్ష!? అది హైడ్రోజన్ బాంబు ఎఫెక్టా? ఇక యుద్ధం తప్పదా?

అది దక్షిణ కొరియా పనే...

అది దక్షిణ కొరియా పనే...

ఇటీవల ఉత్తరకొరియాకు చెందిన యుద్ధనౌక ఒకటి దక్షిణ కొరియా సముద్ర జలాల్లో అనుమానాస్పద స్థితిలో మునిగిపోయింది. ఈ యుద్ధనౌకను దక్షిణ కొరియా దురుద్దేశపూర్వకంగా ముంచివేసినట్లు ఉత్తరకొరియా ఆరోపిస్తోంది. తమ యుద్ధనౌకను ముంచివేసే కుట్ర వెనుక అమెరికా హస్తం కూడా ఉన్నట్లు ఉత్తరకొరియా మండిపడుతోంది. అయితే, యుద్ధ నౌక మునిగిపోవడం వెనుక తమ హస్తం లేదని దక్షిణ కొరియా వాదిస్తోంది.

మీరే యుద్ధం ప్రకటించారు.. మేం ఊరుకుంటామా?

మీరే యుద్ధం ప్రకటించారు.. మేం ఊరుకుంటామా?

‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలుత మా దేశంపై యుద్ధం ప్రకటించారు.. దీంతో మా దేశానికి ఆత్మరక్షణ చర్యలకు దిగే హక్కు ఉంది. దీనిలో భాగంగా ఉత్తర కొరియా భూభాగంలోకి రాకుండా సమీపంలో ఎగిరే బాంబర్లను కూడా మేం నేలకూలుస్తాం..' అని ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి రి యంగ్‌ హో ప్రకటించడంతో ఇరు దేశాల నడుమ చెలరేగిన ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి.

యుద్ధ సన్నాహాల్లో ఉత్తరకొరియా...

యుద్ధ సన్నాహాల్లో ఉత్తరకొరియా...

ఏ క్షణమైనా అమెరికాతో యుద్ధం జరగవచ్చనే అభిప్రాయంతో ఉత్తరకొరియా ఇప్పటికే యుద్ధ సన్నాహాలు ప్రారంభించింది. తూర్పుతీరంలో తన రక్షణ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసింది. యుద్ధమంటూ జరిగితే ఉత్తరకొరియా ఊరుకోదని, తన తడాఖా చూపిస్తుందని ఆ దేశ మిలిటరీ సీనియర్ అధికారి ఒకరు ఇటీవల జెనీవాలో వ్యాఖ్యానించడం ఉత్తరకొరియా యుద్ధ సన్నద్ధతకు సూచనగా కనిపిస్తోంది. మరోవైపు దక్షిణ కొరియాకు చెందిన వేగులు కూడా ఉత్తరకొరియా యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్ధారిస్తున్నారు.

వాయుమార్గాలను తెరిచిన అమెరికా!

వాయుమార్గాలను తెరిచిన అమెరికా!

మరోపక్క అమెరికా కూడా యుద్ధ సమయంలో తీసుకునే చర్యలు తీసుకుంటోంది. తన వాయుమార్గాల‌ను తెరిచింది. ఇప్పటికే గువామ్‌ ద్వీపం నుంచి బయల్దేరిన అమెరికా బాంబర్లు ఈ వాయు మార్గంలోనే ఉత్తర కొరియా తీరసమీపంలో సంచరించాయి. అయితే ఈ విషయాన్ని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్‌ బృందాలు మాత్రం ధ్రువీకరించలేదు.

అమెరికా యుద్ధవిమానాల చక్కర్లు...

అమెరికా యుద్ధవిమానాల చక్కర్లు...

మరోవైపు అమెరికా వైమానిక దళానికి చెందిన బీ-1బీ లాన్సర్ బాంబర్ విమానాలు శనివారం ఉత్తరకొరియా తూర్పు తీరంలోని అంతర్జాతీయ వైమానిక ప్రాంతంలో చక్కర్లు కొట్టాయి. ఈ బలగాల ప్రదర్శన.. ట్రంప్ సైన్యం శక్తిసామర్థ్యాలను సూచిస్తున్నట్లు అమెరికా వ్యాఖ్యానించింది. ఉత్తర, దక్షిణకొరియా విడిపోయాక ఇరుదేశాల సరిహద్దులో అమెరికా యుద్ధవిమానాలు ఆకాశంలో కనిపించడం 21వ శతాబ్దంలో ఇదే తొలిసారని పెంటగాన్ పేర్కొంది.

మరింత ఆజ్యం పోసిన ట్రంప్ ట్వీట్...

మరింత ఆజ్యం పోసిన ట్రంప్ ట్వీట్...

శనివారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ మళ్లీ ఇరుదేశాల నడుమ ఉద్రిక్తతలను పెంచింది. ‘ట్రంప్ మానసిక రోగి.. అతని తీరు యుద్ధాలను పురిగొల్పేలా ఉంది.. మా దేశాన్ని బెదిరించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి..' అంటూ శనివారం రి యాంగ్ హో ఐక్యరాజ్య సమితిలో విమర్శించారు. దీంతో ‘వారు ఎక్కువ కాలం చుట్టుపక్కల ఉండలేరు..' అని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్, ఆ దేశ విదేశాంగ మంత్రి రి యాంగ్‌ హోను హెచ్చరిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్ హో.. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆలోచనలకు అనుగుణంగా ఐక్యరాజ్య సమితిలో బెదిరింపు ప్రసంగం చేశారని ట్రంప్ ఆరోపించారు.

ఇక.. చేతల యుద్ధమేనా?

ఇక.. చేతల యుద్ధమేనా?

గత వారం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, ఆ దేశ విదేశాంగ మంత్రి రి యాంగ్‌లను ట్రంప్ ఘాటుగా హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా కొరియా రాజధాని ప్యాం గ్యాంగ్‌లోని కిమ్ ఇల్ సంగ్ స్కేర్ వద్ద అమెరికాకు వ్యతిరేకంగా శనివారం భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్న దృశ్యాలను ఆ దేశ టీవీ చానెల్ కేఆర్టీ ప్రసారం చేసింది.

రెడీగా ఉత్తరకొరియా రెడ్ గార్డ్స్...

రెడీగా ఉత్తరకొరియా రెడ్ గార్డ్స్...

అమెరికాతో యుద్ధానికి ఉత్తరకొరియా సైన్యం రెడ్ గార్డ్స్ కూడా సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘ప్రపంచం నుంచి అమెరికాను, దుష్ట అధ్యక్షుడిని తొలిగించేందుకు ఆ దేశంతో అంతిమ యుద్ధం చేసేందుకు మంచి సమయం కోసం వేచిచూస్తున్నాం. కిమ్ ఆదేశిస్తే ఆక్రమణదారులను అంతమొందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం..'' అని కొరియా రెడ్‌గార్డ్స్ కమాండింగ్ అధికారి రీ ఇల్ బే అన్నట్టు కేసీఎన్‌ఏ వార్తా సంస్థ తెలిపింది.

English summary
South Korea's spy agency spotted Kim Jong-un's fighter jets moving across the peninsula while the North Korean military scrambled to secure their coastal borders. It comes after the Kim regime threatened to shoot US aircraft out of the sky amid claims Donald Trump had declared war on the hermit kingdom. On Saturday US B-1b bombers, accompanied by fighter jets, deployed from the Andersen Air Force Base in Guam and flew north of the Northern Limit Lane. The region is the most northern point of the Korean demilitarised zone (DMZ) to be explored by the West in recent years, the Pentagon have claimed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X