North Korea: 1500 కిలోమీటర్ల దూరాన్ని తునాతునకలు చేసే మిస్సైల్: జపాన్ ఉలికిపాటు
సియోల్: ఆధునిక నియంత కిమ్‌జొంగ్ ఉన్ నాయకత్వంలో ఉత్తర కొరియా తన ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటోంది. అణ్వాయుధాలపై నిషేధాన్ని విధించిన తరువాత.. మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. అణు రహిత ఆయుధాలను సమకూర్చుకుంటోంది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మిస్సైళ్లు, వాటిని సంధించడానికి వినియోగించే ట్యాంకులను కొనుగోలు చేస్తోంది. ఉత్తర కొరియా దూకుడు.. ఆసియా ఉపఖండంలో ఒకింత ఆందోళనకర పరిస్థితులు నెలకొనడానికి కారణమౌతోంది.

1,500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్.. ధ్వంసం
ఒకవంక- ఆహార కొరత ఆ దేశాన్ని పట్టి పీడిస్తోన్నప్పటికీ లెక్క చేయట్లేదు ఉత్తర కొరియా. ఆయుధాలను పెంపొందించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తోంది. తాజాగా- అత్యాధుక క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్ ఇది. ఏకంగా 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన టార్గెట్‌ను తునాతునకలు చేయదగ్గ శక్తి సామర్థ్యాలు ఈ మిస్సైల్ సొంతం. ప్యాటర్న్-8 ఫ్లయిట్-ఆర్బిట్‌గా దీన్ని పిలుస్తారు.

7,580 సెకెన్లలో..
ఓ గుర్తు తెలియని ప్రదేశం నుంచి ఈ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) వెల్లడించింది. 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను ఈ మిస్సైల్ ఛేదించినట్లు తెలిపింది. 1500 కిలోమీటర్ల దూరాన్ని 7,580 సెకెన్ల వ్యవధిలో అధిగమించినట్లు స్పష్టం చేసింది. ఈ నెల 11, 12 తేదీల్లో క్షిపణుల పరీక్షలను నిర్వహించినట్లు తెలిపింది.

హాజరు కాని నియంత..
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ లాంగ్ రేజ్ మిస్సైళ్ల పరీక్షలు విజయవంతం కావడం పట్ల దేశాధినేత కిమ్‌జొంగ్ ఉన్ సంతృప్తిని వ్యక్తం చేసినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ మిస్సైల్స్ టెస్ట్ ఫైర్స్‌కు కిమ్‌జొంగ్ ఉన్ హాజరు కాలేదని, తన అధికారిక నివాసం నుంచే ఆయన దీన్ని పర్యవేక్షించారని తెలిపింది. కిమ్‌జొంగ్‌కు చెందిన అధికార వర్కర్స్ పార్టీ పొలిట్‌బ్యురో సభ్యుడు, సెంట్రల్ కమిటీ కార్యదర్శి పక్‌జొంగ్ ఛోన్- క్షిపణి పరీక్షలను స్వయంగా పర్యవేక్షించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సి వెల్లడించింది.

ఆరు నెలల్లో..
ఈ ఏడాది మార్చిలో ఉత్తర కొరియా చివరిసారిగా షార్ట్-రేంజ్ బాల్లిస్టిక్స్ క్షిపణులు, క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించింది. ఆ కిందటి నెలలోనే అంటే.. ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడిగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్‌తో సుమారు కిమ్‌జొంగ్ ఉన్ సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా ఫోన్ సంభాషణను సాగించారు. ఈ ఆరు నెలల వ్యవధిలో లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైళ్లను అభివృద్ధి చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆసియా ఉపఖండంలో..
1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ధ్వంసం చేయగల క్షిపణులను సమకూర్చుకుంది. 1,500 కిలోమీటర్ల దూరం అంటే.. అటు దక్షిణ కొరియా, ఇటు జపాన్.. ఆ మిస్సైల్ రేంజ్ పరిధికి వస్తాయి. అదే సమయంలో అణ్వాస్త్రాలపై నిషేధం, ఆయుధాలను సమకూర్చుకోవడంపై ఆంక్షలు ఉన్న ప్రతికూల పరిస్థితుల్లోనూ కిమ్‌జొంగ్ ఉన్.. మిస్సైళ్ల పరీక్షలను విజయవంతం చేయడం ఆసియా ఉపఖండంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుందనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి.
Recommended Video

ఆహార కొరత ఉన్నా..
ఆహార కొరత నెలకొన్నప్పటికీ.. ఆయుధ సంపత్తిని పెంపొందించుకోవడానికి కిమ్ జొంగ్ ప్రాధాన్యత ఇస్తుండటం పొరుగు దేశాలను కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రత్యేకించి- దక్షిణ కొరియా.. ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దక్షిణ కొరియాలోనే అన్ని ప్రధాన ప్రాంతాలను టార్గెట్ చేసేలా 1500 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ మిస్సైళ్లను అభివృద్ధి చేసుకోవడం ఆ దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది.












Click it and Unblock the Notifications