కిమ్‌జొంగ్ అదృశ్యం..: ఆరా తీస్తోన్న అమెరికా

ఆధునిక నియంతగా పేరున్న ఉత్తర కొరియా అధినేత కిమ్‌జొంగ్ ఉన్.. కొంతకాలంగా కనిపించట్లేదు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కూడా ఆయన గైర్హాజరవుతుండటం అనేక ఊహాగానాలకు తెర తీసింది.

ప్యాంగ్యాంగ్: ఆధునిక నియంతగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్‌కు మళ్లీ ఏమైంది? , తీవ్ర అనారోగ్యానికి గురయ్యారా? అధికారిక కార్యక్రమాలు, సమావేశాలకూ ఎందుకు గైర్హాజర్ అవుతున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఉత్తర కొరియాలో నెలకొన్న ఆహార, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడానికి ఏర్పాటు చేసిన కీలకమైన పొలిట్ బ్యూరో భేటీకీ ఆయన డుమ్మా కొట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 36 రోజులుగా..

36 రోజులుగా..

కిమ్ జొంగ్ 36 రోజులుగా కనిపించట్లేదు. బాహ్య ప్రపంచం ముందుకు రావట్లేదు. దీనిపై అధికారంలో ఉన్న వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వట్లేదు. కిమ్ జొంగ్ ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి వెళ్లడం కొత్తేమీ కాదు. గతంలో రెండుసార్లు ఆయన ఇలా అదృశ్యం అయ్యారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. 36 రోజులుగా కిమ్ జొంగ్ ఎలాంటి అధికారిక కార్యక్రమాలకు గానీ, సమావేశాలకు గానీ హాజరు కావట్లేదు.

 గతంలో కార్డియో వాస్కులర్‌ తో..

గతంలో కార్డియో వాస్కులర్‌ తో..

2020లో కిమ్ జొంగ్ ఉన్ కార్డియో వాస్కులర్ బారిన పడ్డారు. విపరీతంగా పొగతాగడం, భారీ శరీరం కావడం వల్ల కార్డియో వాస్కులర్‌ కు గురయ్యారు. దీనితో ఆయన హ్యూయంగ్‌సాన్‌లోని ఓ విల్లాలో సర్జరీ చేయించుకున్నారనే ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తు జరిగింది. కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తరువాత కిమ్ జోంగ్.. రాజధాని ప్యాంగ్యాంగ్‌కు తిరిగి వచ్చారని, అనంతరం అబ్జర్వేషన్‌లోకి వెళ్లారని డెయిలీఎన్‌కే ఆన్‌లైన్ న్యూస్ పేపర్ పేర్కొంది. అంతకు ముందు 2014లోనూ కిమ్ జొంగ్ సుమారు 40 రోజుల పాటు అజ్ఞాత జీవితాన్ని గడిపారు.

ఆదివారం కీలక భేటీ..

ఆదివారం కీలక భేటీ..

ఈ నెల 5వ తేదీన కిమ్ జొంగ్ ఉన్ సైనిక సమావేశానికి హాజరు కాలేదు. అప్పటి నుంచీ - ఆయన ఏమైపోయారనేది ప్రశ్నార్థకమైంది. సైనిక భేటీలకు ఆయన క్రమం తప్పకుండా హాజరవుతుంటారు. దీనితో పాటు సెంట్రల్ మిలిటరీ కమిషన్ సమావేశంలోనూ కిమ్ కనిపించలేదు. ఈ భేటీకి ఆయన హాజరయ్యారంటూ నార్త్ కొరియా న్యూస్ తెలిపింది. తన పొరుగు దేశం దక్షిణ కొరియాపై యుద్ధానికి కిమ్ సన్నద్ధమౌతోన్నారనే ప్రచారం సైతం ఊపందుకుంటోండటం చర్చనీయాంశమౌతోంది. తాజా పరిణామాలపై అమెరికా ఆరా తీస్తోన్నట్లు తెలుస్తోంది.

పెద్ద ఎత్తున మిస్సైల్స్ పరీక్షలు..

పెద్ద ఎత్తున మిస్సైల్స్ పరీక్షలు..

ఉత్తర కొరియా గత ఏడాది పెద్ద ఎత్తున వివిధ రకాల మిస్సైల్స్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఖండాంతర క్షిపణులు, బాలిస్టిక్స్ మిస్సైళ్లను సంధించిందా దేశం. ఒక్క ఏడాదిలోనే 70 మిస్సైళ్లను ప్రయోగించింది. దక్షిణ కొరియా, జపాన్ లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. మెజారిటీ మిస్సైల్ టెస్టింగ్స్ ను కిమ్ జొంగ్ స్వయంగా పర్యవేక్షించారు. దక్షిణ కొరియాతో చిరకాలంగా ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో యుద్ధ ట్యాంకులు, ఫిరంగులను సిద్ధం చేశారు అప్పట్లో. అమెరికా విధించిన ఆంక్షలు, ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాలను కాదని అణ్వాయుధాలను సిద్ధం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+