వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మీ హద్దుల్లో మీరుండండి.. మిత్ర దేశం అని కూడా చూడం’, చైనాకు ఉత్తరకొరియా వార్నింగ్!

ఉత్తర కొరియా దుందుడుకుతనం సెగ చైనాకు కూడా తగిలింది. ‘ఏదో మిత్ర దేశం కదా బుజ్జగించి చూద్దాం..’ అనుకుంటే చైనాపైనే బుసలు కొట్టింది ఉత్తర కొరియా.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

సియోల్: ఉత్తర కొరియా దుందుడుకుతనం సెగ చైనాకు కూడా తగిలింది. 'ఏదో మిత్ర దేశం కదా బుజ్జగించి చూద్దాం..' అనుకుంటే చైనాపైనే బుసలు కొట్టింది ఉత్తర కొరియా. తమ సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరని, సహనాన్ని పరీక్షిస్తే మిత్ర దేశం అని కూడా చూడమంటూ వార్నింగ్ ఇవ్వడంతో చైనా నివ్వెరపోయింది.

వ‌రుస‌గా అణు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తూ ప్ర‌పంచ దేశాల్లో భ‌యం నింపుతున్న ఉత్త‌ర‌కొరియాకు చైనా మంచి మిత్ర దేశ‌మ‌న్న విష‌యం తెలిసిందే. ఉత్త‌ర‌కొరియాలో చైనా త‌న‌ వ్యాపారాన్ని అధికంగానే విస్త‌రించుకుంది.

అయితే, ప్ర‌స్తుతం నెలకొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేపథ్యంలో ఇటీవ‌లే చైనా ఉత్త‌రకొరియాను కాస్త తగ్గమంటూ హెచ్చరించింది. అమెరికా ఒత్తిడి నేపథ్యంలో అణు కార్యక్రమాలను తక్షణమే రద్దు చేసుకోమంటూ ఉత్తరకొరియాకు సూచించింది.

North Korean Media, in Rare Critique of China, Says Nuclear Program Will Continue

అయితే, చైనా జోక్యంపై ఉత్త‌ర‌కొరియా రివర్స్ అయింది. తిరిగి చైనాకే గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తమపై నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేయ‌కూడ‌ద‌ని, త‌మ‌ సంకల్పాన్ని ఎవ్వరూ కదిలించలేరని ఉద్ఘాటించింది. తమ అణ్వాయుధ కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

అంతేకాదు, త‌మ సహనాన్ని ఇంకా పరీక్షిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మిత్రదేశం అని కూడా చూడమంటూ చైనాకు ఎదురుతిరగడంతో చైనా పని అడకత్తెరలో పోక చెక్కలా మారింది. చైనా తన స్వీయ రక్షణ కోసమైనా త‌మ దేశం పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలంటూ ఉత్తర కొరియా తన అధికారిక న్యూస్ ఏజెన్సీ ద్వారా ఘాటు వ్యాఖ్య‌లు చేయడంతో చైనాకు దిమ్మతిరిగిపోయింది.

English summary
In a rare and surprisingly pointed criticism of China, North Korea’s state-run news agency warned in a commentary that the country would continue its nuclear weapons program even if it risked losing a friendly relationship with its longtime ally. “One must clearly understand that the D.P.R.K.’s line of access to nukes for the existence and development of the country can neither be changed nor shaken,” the commentary said, referring to the Democratic People’s Republic of Korea, the North’s official name. “And that the D.P.R.K. will never beg for the maintenance of friendship with China, risking its nuclear program which is as precious as its own life, no matter how valuable the friendship is.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X