వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్‌కు షాక్: రెచ్చిన నార్త్‌కొరియా, జీవితంలో ఒక్క మంచి పని చేయవా? అంటూ ట్రంప్ ఫైర్

ఎప్పుడూ యుద్ధానికి కాలు దువ్వుతున్నట్లు వ్యవహరిస్తున్న ఉత్తర కొరియా వ్యవహారం అమెరికాతోపాటు పొరుగుదేశాలకు తలనొప్పిగా మారింది. తాజాగా, ఉత్తరకొరియా మరోసారి రెచ్చిపోయింది.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/టోక్కో: ఎప్పుడూ యుద్ధానికి కాలు దువ్వుతున్నట్లు వ్యవహరిస్తున్న ఉత్తర కొరియా వ్యవహారం అమెరికాతోపాటు పొరుగుదేశాలకు తలనొప్పిగా మారింది. తాజాగా, ఉత్తరకొరియా మరోసారి రెచ్చిపోయింది. ఈసారి ఏకంగా జపాన్‌ ప్రత్యేక ఆర్థిక మండలి(ఈఈజ్) ప్రదేశంలోకి ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. కాగా, ఈ విషయాన్ని జపాన్‌ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది.

బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం

బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం

ఉత్తరకొరియా మంగళవారం తెల్లవారుజామున బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిందని జపాన్ ప్రభుత్వం పేర్కొంది. ఈ క్షిపణి 40 నిమిషాల పాటు 980 కిలోమీటర్లు ప్రయాణించి తూర్పుసముద్రంలోని జపాన్‌ ప్రత్యేక ఆర్థిక మండలిలో పడిందని తెలిపింది. ఐక్యరాజ్యసమితి నియమాలను ఉత్తర కొరియా మరోసారి ఉల్లంఘించిందని, దీన్ని సహించలేది లేదని జపాన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

షింజో అబే ఆగ్రహం

షింజో అబే ఆగ్రహం

ఉత్తర కొరియా తీరుపై జపాన్‌ ప్రధాని షింజో అబే ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంఘాలు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా ఉత్తర కొరియా పట్టించుకోవడం లేదన్నారు. ఆ దేశం ఆగడాలను అడ్డుకుని, దీటుగా సమాధానమిచ్చేందుకు చైనా, రష్యా దేశాలతో చర్చిస్తామన్నారు. త్వరలో జరగబోయే జీ20 సదస్సులో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామన్నారు. జులై 7,8 తేదీల్లో జర్మనీలోని హాంబర్గ్‌లో జీ20 సదస్సు జరగనుంది. ఈ సమావేశాలకు అమెరికా, చైనా, జపాన్‌, దక్షిణకొరియా తదితర దేశాలు హాజరుకానున్నాయి.

ప్రయోగం విజయవంతమంటూ ఉత్తరకొరియా...

ప్రయోగం విజయవంతమంటూ ఉత్తరకొరియా...

ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టినట్లు ఉత్తరకొరియా ప్రకటించింది. దశాబ్దాలుగా ఉన్న తమ సుదీర్ఘ ఆకాంక్ష దీనితో నెరవేరిందని హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వ కొరియన్‌ సెంట్రల్‌ టెలివిజన్‌లో ఈ ప్రయోగం విజయవంతంపై ప్రకటన కూడా ఇచ్చారు. దేశాధ్యక్షుడు కిమ్‌ ఉన్‌ జోంగ్‌ పర్యవేక్షణలో హవసాంగ్‌-14 క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు పేర్కొన్నారు.

జీవితంలో ఒక్క మంచి పని కూడా చేయవా?..

తాజా బాలిస్టిక్‌ ప్రయోగంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ వున్‌ తీరుపై మండిపడ్డారు. ‘ఉత్తర కొరియా మరో క్షిపణిని ప్రయోగించింది. ఈ వ్యక్తి తన జీవితంలో ఏదైనా మంచిపని చేయలేడా?' అని కిమ్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ఏళ్ల నాటి నుంచి ఉత్తర కొరియా వైఖరిని దక్షిణకొరియా, జపాన్‌ భరిస్తున్నాయంటే నమ్మడానికే కష్టంగా ఉందని ట్రంప్‌ అన్నారు. దీనికి చైనా దీటుగా బదులుచెప్పి ఉత్తరకొరియా చేసే చెత్తపనులను వెంటనే ఆపాలని ట్రంప్‌ కోరారు.

English summary
Donald Trump has broken off from American Independence Day celebrations to direct his Twitter fire at Kim Jong-un, mocking the North Korean leader for having “nothing better to do”, hours after his regime fired a ballistic missile into waters near Japan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X