మార్పు: సత్య నాదెళ్లను అవార్డుతో సత్కరించనున్న ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను 'ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్' అవార్డుతో సత్కరించనున్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో పని చేసే ఉద్యోగుల కుటుంబాల శ్రేయస్సుకు అనుగుణంగా సత్య నాదేళ్ల మార్పులు చేసినందుకు గాను ఆయనను సత్కరించనున్నారు.
మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సత్య నాదెళ్ల.. ఉద్యోగుల కుటుంబాల శ్రేయస్సుకు ఉపకరించేలా సాఫ్ట్‌వేర్ అగ్రగామి సంస్థ అయిన మైక్రోసాఫ్ట్‌లో మార్పులు తీసుకు వచ్చారని, ఈ మార్పులకు గాను ఆయన ఈ గౌరవం పొందనున్నారు.
ఇటీవల మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాల తీరును మార్చుకుంటోంది. అనేక భిన్న రంగాల్లోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం అమెరికాలో అనేక కొత్త సరఫరా సప్లయర్స్‌తో కలిసి పని చేయనుంది. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు కూడా ఇప్పుడు వీరందరితో వ్యవహారాలు నిర్వహించాల్సి ఉంటుంది.

ఇలాంటి కొత్త సంస్థలతో విధులు నిర్వహించే మైక్రోసాఫ్ట్ సిబ్బందికి కనీసం పదిహేను రోజుల వేతనంతో కూడిన సెలవును అందించాలని సత్య నిర్ణయించారు.
కాగా, సాఫ్ట్ అధినేతగా ఉన్న సత్య నాదెళ్ల ఈ రికార్డును సాధించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల్లో అత్యధిక వేతనం అందుకుంటున్న జాబితాలో భారత సంతతికి చెందిన నాదెళ్లకు మొదటి స్థానం లభించింది.
సంవత్సరానికి సత్య నాదెళ్ల అందుకుంటున్న జీతం 84.3 మిలియన్ డాలర్లు. ఇది భారతీయ కరెన్సీలు రూ.525 కోట్లకు పైమాటే. అంతర్జాతీయంగా 100 కంపెనీల్లో పని చేస్తున్న సీఈవోలు అందుకుంటున్న వేతనాలపై ఒక నివేదిక విడుదలైంది.
నిరుడు తొలి స్థానంలో నిలిచిన ఒరాకిల్ చీఫ్ లారీ ఎల్లిసన్, ప్రస్తుత సంవత్సరానికి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. భారత సంతతికి చెందిన మరోవ్యక్తి పెప్సికో సీఈవో ఇంద్రా నూయికి 19.08 మిలియన్ డాలర్లతో 19వ స్థానం దక్కింది. కాగా, ప్రముఖ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ టాప్-100లో చివరి స్థానం లభించింది.












Click it and Unblock the Notifications