వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఫై కూడా రావట్లేదు: వైట్‌హౌజ్‌పై ఒబామా అసహనం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారిక భవనం వైట్‌హౌజ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైట్‌హౌ్‌'స్‌లో లెక్కకుమిక్కిలి డెడ్‌ స్పాట్‌ల కారణంగా వైఫై వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని ఆయన ఫిర్యాదు చేస్తున్నారు. ప్రస్తుతం సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉన్న వైఫై వ్యవస్థ వైట్‌హౌ్‌సలో సమర్థంగా పనిచేయడం లేకపోవడంతో ఒబామా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పాత భవనం కావడంతో విపరీతమైన డెడ్‌స్పాట్ల కారణంగా సిగ్నళ్లు అందక వైఫై పనిచేయడం లేదని ఒబామా చెప్పారు. అయితే మరో ఏడాదిలో తన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి కోసం వైట్‌హౌ్‌సలో వైఫై వ్యవస్థను ఆధునీకరిస్తామని ఒబామా చెప్పారు. భార్య మిచెల్లీతో కలిసి తొలిసారిగా ఒబామా ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

Obamas lament White House Wi-Fi situation

కొత్త ప్రెసిడెంట్‌ ఫ్యామిలీ కోసం ఏమైనా సలహాలు ఇవ్వదలచుకున్నారా? వైట్‌హౌ్‌స్‌లో నీళ్ల సౌకర్యం బాగుందా? వైఫై ఉందా? లింకన్‌ బెడ్‌ రూమ్‌లో టాయిలెట్‌ చక్కగా పనిచేస్తుందా? అంటూ ఛానల్‌ ప్రతినిధి ఒబామాకు ప్రశ్నలు సంధించారు. వీటిలో వైఫైపై మాత్రమే ఒబామా స్పందించారు. మిచెల్లీ మధ్యలో జోక్యం చేసుకుంటూ.. వైఫైలో అంతరాయాల కారణంగా కూతుళ్లు మలియా, సాహా అసహనం వ్యక్తం చేస్తున్నారని వాపోయారు.

మాజీ అధ్యక్షుడిగా వైట్‌హౌ్‌సను వీడేముందు మరోసారి వైట్‌హౌ్‌స్‌లో బిగ్‌ సూపర్‌ బౌల్‌ పార్టీతో సందడి చేస్తామని ఈ దంపతులు తెలిపారు. నాలుగైదేళ్ల క్రితం అత్యంత సన్నిహితులకు సూపర్‌ బౌల్‌ విందు ఇచ్చామని ఒబామా గుర్తుచేసుకున్నారు.

English summary
President Barack Obama and first lady Michelle Obama on Sunday discussed their traditions for the Super Bowl, as well as the improvement the President wants to make to the White House for his successor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X