కన్న కొడుకునే పెళ్లి చేసుకుంది: కూతురినీ కూడా!.. అమెరికాలో ఓ తల్లి ఇలా!

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: కడుపున పుట్టిన పిల్లలనే పెళ్లి చేసుకుందో తల్లి. కొడుకును వివాహం చేసుకుని అతనితో విడిపోయాక.. కుమార్తెను కూడా పెళ్లి చేసుకుంది. ఆమెతో లైంగిక కార్యకలాపాలను కొనసాగించింది. స్థానికుల సమాచారంతో ఆమెపై కేసు నమోదవగా.. వచ్చే జనవరిలో కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువడనుంది.

వివరాల్లోకి వెళ్తే.. పాట్రిసియా స్పాన్(44) అనే మహిళకు 30ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లకే భర్తతో మనస్పర్థలు వచ్చి విడిపోయింది. అప్పటికే ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం ఉన్నారు. వీరంతా నాయనమ్మ వద్దే పెరిగారు. కొన్నాళ్లకు 2008లో పెద్ద కొడుకు(18)తో పాట్రిసియాను పెళ్లి చేసుకుంది.

Oklahoma Woman Who Married Her Mother Pleads Guilty To Incest

15నెలల్లోనే వీరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత కుమార్తెతో సంబంధం పెట్టుకుంది. ఆమెనూ పెళ్లి చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఆమెపై కేసు నమోదవగా.. పెళ్లి సమయంలో పిల్లలద్దరిని వేరే వ్యక్తుల సంతానంగా పేర్కొన్నట్టు తెలుస్తోంది.

కోర్టులో తల్లికి, కూతురికి పదేళ్ల జైలు శిక్ష పడింది. అయితే తన తప్పేమి లేదని కుమార్తె వేడుకోవడంతో.. ఆమె శిక్షను రెండేళ్లకు తగ్గించారు. పాట్రిసియాకు వచ్చే జనవరిలో తుది శిక్షను ఖరారు చేయనున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An Oklahoma woman who married her biological mother last September pleaded guilty to incest on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి