'ప్రపంచంలో 80 శాతం సమస్యలు వారి వల్లే'.. ట్రంప్ పై ఒబామా ఫైర్
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల్లో ఉన్న సమస్యల్లో 80 శాతం వృద్ధ నేతల వల్లే జరుగుతున్నాయని అన్నారు. అధికారంలో వేలాడుతూ ప్రతి సమస్యలోనూ తల దూర్చుతున్నారని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి చేసినట్లు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి.
అమెరికా మాజీ అధ్యక్షుడు, డెమోక్రాట్స్ నేత బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల సమస్యలకు 80 శాతం ప్రస్తుతం ఉన్న వృద్ధ నేతలు, వారి నిర్ణయాలే కారణం అని బాంబ్ పేల్చారు. ఆ నేతలు అధికారాన్ని పట్టుకుని వేలాడటం వల్లే ప్రపంచంలో అశాంతి పెరిగిపోయిందన్నారు. పిరమిడ్లను నిర్మించి వాటిపైనా తమ పేర్లను చెక్కించుకుంటున్నారని మండిపడ్డారు. అయితే ప్రస్తుతం ట్రంప్ వయసు 77 ఏళ్లు కావడంతో ట్రంప్ ను ఉద్దేశించే ఒబామా ఈ వ్యాఖ్యలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. లండన్ లోని ఓ కార్యక్రమానికి హాజరైన ఒబామా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

" ఇది చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. 80 శాతం ప్రపంచ దేశాల సమస్యలు వృద్ధ నేతల వల్లనే జరుగుతున్నాయి. ప్రతిదానిపైనా వారి పేర్లు రాసుకుంటున్నారు. పిరమిడ్స్ నిర్మించి వాటిపైనా పేర్లు రాసుకుంటున్నారు" అని ఒబామా చెప్పుకొచ్చారు. బ్రిటిష్ చరిత్రకారుడు డేవిడ్ ఒలుసొగాతో జరిగిన సంభాషణలో ఆయన ఈ కీలక కామెంట్స్ చేశారు. 2008 నుంచి 2017 వరకు అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన ఒబామా 2019 లోనూ ఇలాంటి కామెంట్స్ చేశారు.












Click it and Unblock the Notifications