వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డెల్టా వేరియంట్ దెబ్బ: 24 దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసిన ఒమన్ -భారత కార్మికుల వెతలు

|
Google Oneindia TeluguNews

గల్ఫ్ దేశాల్లో మళ్లీ కరోనా మహమ్మారి పడగవిప్పుతున్నది. ప్రమాదకర డెల్టా వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. అది మరింతగా విస్తరించకుండా ఉండేలా ఒమన్‌ దేశం భారీ కట్టడి చర్యలకు పూనుకుంది. భారత్‌తో సహా 24 దేశాల నుంచి ప్రయాణికుల విమానాలను నిరవధికంగా నిలిపేస్తూ ఒమన్ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది.

తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు జాబితాలోని 24 దేశాల నుంచి ప్రయాణ విమానాలను రద్దు చేసినట్లు ఒమన్ అధికారికంగా ప్రకటించింది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రయాణికుల విమానాలను ఒమన్‌ నిలిపివేసిన జాబితాలో భారత్ తోపాటు బ్రిటన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, సింగపూర్‌, ఇండోనేషియా, బ్రెజిల్‌ వంటి దేశాలు ఉన్నాయి.

oman-suspends-flights-from-24-countries-including-india-pakistan-amid-delta-variant

కాగా, బుధవారం ఒమన్‌లో కొత్తగా 1,675 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,80,235కు చేరింది. ఒమన్‌లో ఇప్పటి వరకు 3,356 మంది కరోనా వల్ల మరణించారు. ఇదిలా ఉంటే,

Recommended Video

Lockdown : India Plans To Bring Back Over 14,000 Stranded Indians In 64 flights | Oneindia Telugu

విమానాల రద్దు, కొవిడ్ వ్యాప్తిపై తీవ్ర ఆంక్షలకుతోడు స్వదేశీయులకు ఉపాధి కల్పించాలన్న అక్కడి ప్రభుత్వ ధోరణి ఒమన్ లోని భారతీయ కార్మికుల పాలిట శాపంగా మారింది. వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకుంటోన్న ఒమన్‌ ఇప్పటికే ఎందరో విదేశీ వలస కార్మికులను స్వదేశాలకు పంపించేసింది. ఈ నెల 20 నుంచి వాణిజ్య రంగాలలో విదేశీ వలస కార్మికుల స్థానంలో ఒమన్‌ పౌరులకు ఉపాధి కల్పించనున్నారు.

English summary
Oman on Thursday indefinitely suspended passengers flights from 24 countries, including India, Pakistan and Bangladesh, as part of the Gulf nation's efforts to arrest the spread of the coronavirus. The flights have been suspended until further notice, the sultanate's official Twitter account for countering Covid-19 announced. The decision was taken as part of the country's measures to contain the coronavirus pandemic, it said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X