ఆర్థిక మంత్రి టార్గెట్, కాల్పులు, మృతి

కొలంబో: ఎన్నికల ర్యాలి జరుగుతున్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిని టార్గెట్ చేసుకున్న దండుగులు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెంది అనేక మందికి గాయాలైన సంఘటన శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగింది. కాల్పులు జరిపి పరారైన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఆగస్టు 17వ తేదిన శ్రీలంకలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంలో పలు పార్టీల నాయకులు పోటాపోటిగా ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం శ్రీలంక ఆర్థిక శాఖ మంత్రి, యూఎన్ పీ ఎంపీ రవి కారణ్యాంకే కు మద్దతుగా పలువురు కార్యకర్తలు ప్రచారం చేస్తు ఎన్నికల ర్యాలి నిర్వహిస్తున్నారు.

One Dead in Shooting at Colombo Rally in Sri lanka

ఆ సందర్బంలో రెండు బైక్ ల మీద వచ్చిన దుండగులు తుపాకులతో ర్యాలిలో పాల్గోన్న వారి మీద కాల్పులు జరిపారు. ఈ సందర్బంలో కార్యకర్తలు చెల్లాచెదురు అయ్యారు. తుపాకి తూటాలకు ఒక మహిళ మృతి చెందింది. 12 మందికి బుల్లెట్ గాయాలైనాయి.

అంతకు ముందు ఆర్థిక శాఖ మంత్రి రవి కారుణ్యాంకే అక్కడే ఉన్నారు. కొద్ది సేపటి క్రితమే ఆయన అక్కడి నుండి వెళ్లారని సీనియర్ పోలీసు అధికారి రువాణ్ గుణశేఖర చెప్పారు. ర్యాలిపై కాల్పులు జరిపిన దుండగుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+