షాక్: డేటా కాదు టోటల్ సినిమానే హ్యాక్‌ చేశారు.. భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నారు

Posted By:
Subscribe to Oneindia Telugu

లాస్‌ఏంజెల్స్‌: రెండు రోజులుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న రామ్సన్‌వేర్‌ హ్యాకర్లు మళ్లీ రెచ్చిపోయారు. ఈసారి ప్రముఖ హాలీవుడ్‌ చిత్రం 'పైరేట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌' సినిమా వీడియోని తస్కరించారు.

పైరేట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌ సిరీస్‌లో ఐదో భాగం "డెడ్‌మెన్‌ టెల్‌ నో టేల్స్‌" పేరుతో ఈ తాజా చిత్రాన్ని నిర్మించారు. జాన్‌డెప్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది.

Online pirates claim to hold Disney's latest 'Pirates of the Caribbean' movie hostage, demand ransom

వాల్ట్‌డిస్నీ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. అయితే ఈ సినిమా ఆన్‌లైన్‌లో విడుదల కాకుండా హ్యాకర్లు భారీ మొత్తాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తామే సినిమాను ఆన్‌లైన్‌లో ఉంచుతామని నిర్మాతలను బెదిరిస్తున్నారు.

అయితే స్టూడియో సీఈవో బాబ్‌ ఐగర్‌ మాత్రం హ్యాకర్లు అడిగినంత మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించాడు. హ్యాకర్లు మొదట 5 నిమిషాల చిత్రాన్ని విడుదల చేస్తామన్నారని, అడిగినంత మొత్తం చెల్లించకపోతే 20 నిమిషాల వీడియోని రిలీజ్‌ చేస్తామని బెదిరించారని ఆయన పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
ackers have once again struck at Hollywood, this time claiming one of the summer’s biggest blockbuster releases — Disney’s “Pirates of the Caribbean: Dead Men Tell No Tales,” the fifth installment in the highly profitable swashbuckling franchise, starring Johnny Depp. Walt Disney Co. Chief Executive Bob Iger told ABC employees in New York on Monday that hackers have claimed to have stolen a movie and are threatening to release it in segments until their demands, which include a pirate-like ransom paid with Bitcoin, are met.
Please Wait while comments are loading...