Tsunami:సునామీ వేళ ట్రెండింగ్‌లో టాప్ యాంకర్ ఓప్రా విన్‌ఫ్రే..ఎందుకో తెలుసా..?

Tsunami:ఓప్రా విన్ ఫ్రే.. ప్రముఖ టీవీ హోస్ట్. అంతకుమించి ప్రపంచంలో టాప్ సెలబ్రిటీస్‌లో ఒకరు. ఇప్పుడు ఈమె గురించి ఎందుకంటారా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె పేరు ట్రెండ్ అవుతోంది. ఇందుకు కారణం రష్యాను కుదిపేసిన సునామీ. అసలు సునామీకి ఓప్రా విన్‌ఫ్రేకి సంబంధం ఏంటనేగా మీ డౌటు.. అక్కడికే వస్తున్నా.

రష్యాను సునామీ కుదిపేసిన విషయం తెలిసిందే. కామ్‌చట్కా ప్రాంతాన్ని రిక్టర్ స్కేల్‌ పై 8.8తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దీంతో సునామీ అలర్ట్‌లు జారీ అయ్యాయి.భారీ ఎత్తున సముద్రపు అలలు ఇటు రష్యాపై విరుచుకుపడగా.. జపాన్ తీర ప్రాంతాన్ని ఇంకొన్ని గంటల్లో తాకుతుందని అమెరికా జియలాజికల్ సర్వే వెల్లడించింది. ఇక సునామీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ టీవీ హోస్ట్ 70 ఏళ్ల ఓప్రా విన్‌ఫ్రే పేరు కూడా ట్రెండ్ అవుతోంది.

oprah-winfrey-trends-amidst-tsunami-alert-is-her-private-road-blocking-evacuation

ద్వీపం మధ్యలో ఓప్రా ఆస్తులు
హవాయ్ ప్రాంతానికి సునామీ అలర్ట్ జారీ కావడంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్నారు. మావ్ ప్రాంతానికి ఈ ముప్పు ఎక్కువగా ఉండటంతో సురక్షితంగా ఉండేందుకు ఎత్తయిన ప్రాంతాలకు చేరుకుంటున్నారు.వైలీ నుంచి కులా ప్రాంతానికి వెళ్లాలంటే చుట్టు అవుతుంది. సమయం వృథా అవుతుంది. ఈ మధ్యలోనే ఓప్రా విన్‌ఫ్రేకు సంబంధించిన ప్రైవేట్ ఆస్తులున్నాయి. విన్ ఫ్రే కనుక ఇక్కడ గేట్ ఓపెన్ చేస్తే చాలా తక్కువ సమయంలోనే ఈ మార్గం గుండా వెళ్లి ప్రజలు సురక్షితంగా ఉండే అవకాశం ఉంది. అయితే విన్‌ఫ్రే మాత్రం ఆ ప్రాంతంకు సంబంధించిన గేట్‌ను ఓపెన్ చేసేందుకు ససేమిరా అందని వార్తలొస్తున్నాయి.దీంతో ఆ ప్రాంతమంతా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ విజువల్స్ కూడా చూడండి.

ఓప్రా ఆస్తులు తెలిస్తే షాక్..
ప్రైవేట్ రోడ్‌ను తెరిచేందుకు ఓప్రా ఒప్పుకోవడం లేదనేది సమాచారం.ఇక హవాయ్ ద్వీపంలో ఓప్రా ఆస్తులు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. మావ్ ద్వీపంలో 1000 ఎకరాలు కొనుగోలు చేసిందని ప్రముఖ బిజినెస్ పోర్టల్ రియల్టర్ డాట్ కామ్ పేర్కొంది.2002,2003లో ఓప్రా విన్‌ఫ్రే 163 ఎకరాలను కులా ప్రాంతంలో కొనుగోలు చేశారట.అక్కడే అత్యాధునిక వసతులతో కూడిన ఫామ్‌ హౌజ్ నిర్మించుకున్నారు. ఇక క్రమేణా అదే హవాయి ప్రాంతంలో ఆస్తులను విస్తరించుకుంటూ పోయారు. కులా హనా ప్రాంతంలో 870 ఎకరాలు వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు.ఇలా ఈ 70 ఏళ్ల ఓప్రా విన్‌ఫ్రే సునామీ వేళ వార్తల్లో నిలిచారు.

2023లో మావ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సమయంలో విన్‌ఫ్రే ఆ రోడ్‌ను తెరిచేందుకు అనుమతించింది.పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న చాలామంది తమ ప్రాణాలు కాపాడుకోగలిగారు. నాడు ఓప్రా విన్‌ఫ్రే చూపించిన మానవత్వం పట్ల ఆమెను ఒక దేవతతో పోల్చారు అక్కడి ప్రజలు, అధికార యంత్రాంగం. ప్రస్తుతం సునామీ హెచ్చరికల నేపథ్యంలో కూడా అదే మానవత్వాన్ని ప్రదర్శించాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఓప్రా మానవత్వంతో వ్యవహరించి ఆ మార్గం తెరిస్తే చాలామంది ప్రాణాలను కాపాడిన వారవుతారు. మరి ఓప్రా ఆ మార్గాన్ని తెరుస్తారో లేదో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+