బతికిపోయా: గే క్లబ్ షూటర్‌పై మాజీ భార్య, తల్లి-కొడుకు కదిలించే సంభాషణ

ఫ్లోరిడా: 'అమ్మా.. పోలీసులకు ఫోన్ చెయ్. నేను బాత్రూంలో దాక్కున్నా. అతడు వచ్చేస్తున్నాడు. నేను చచ్చిపోతున్నాను' అని ఓ తల్లికి దాడి సమయంలో కొడుకు పంపించిన సందేశం. ఒమర్ మతీన్ అనే ఉన్మాది పల్స్ నైట్ క్లబ్‌లో నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 50మందికి పైగా మృతి చెందారు.

అతను నరమేధం సృష్టిస్తున్న సమయంలో ఓ కొడుకు.. తన తల్లికి ఫోన్ చేసి ఆందోళన వ్యక్తం చేశాడు. ఎడ్డీ జాన్సన్ అనే 30 ఏళ్ల యువకుడు ఓర్లాండో పల్స్ క్లబ్‌లో జరిగిన దాడిలో చిక్కుకున్నాడు.

ఈ సందర్భంగా అతను తన తల్లికి ఓ సందేశం పంపించాడు. అమ్మా నీవంటే నాకు ఇష్టమని, క్లబ్‌లో ఎవరో దుండగుడు కల్పులు జరుపుతున్నాడని మెసేజ్ పంపించాడు. ఈ విషయాన్ని అతని తల్లి చెప్పింది. అయితే, ఈ దాడిలో అతను చనిపోయాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Orlando massacre: Omar Mateen's ex-wife says he beat her and held her hostage

తన కొడుకు ప్రాణభయంతో ఆడవాళ్ల టాయిలెట్లో దాక్కున్నాడని, అక్కడ ఇంకా చాలామంది ఏడుపులు తనకు వినిపించాయని ఆమె చెప్పింది. తొలుత ఫోన్ చేసి భయం భయంగా ఉంటే సందేశం పంపించాల్సిందిగా సూచించానని చెప్పింది.

ఆ తల్లికి అర్ధరాత్రి రెండు గంటల ఆరు నిమిషాలకు తొలి సందేశం ఐ లవ్యూ మమ్మీ అని వచ్చింది. ఆ తర్వాత క్లబ్‌లో ఎవరో దుండగుడు కాల్పులు జరుపుతున్నాడని మెసేజ్ చేసింది. దీంతో కొడుకుకు ఫోన్ చేయాలని ప్రయత్నిస్తే కలవలేదు.

ఆ తర్వాత నీవు ఎలా ఉన్నావని, కొడుకును అడగగా.. బాత్రూంలో దాక్కున్నట్లు మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత క్లబ్ గురించి ఆరా తీసింది. అమ్మా.. పోలీసులకు వెంటనే ఫోన్ చేయమంటూ అతను ఆర్తనాదాలు పెట్టాడు. ఆ వెంటనే ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. తన కుమారుడు గే అని, అతను అ క్లబ్‌కు వెళ్తాడని ఆమెకు తెలుసు.

ఆ తర్వాత అర్ధరాత్రి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల సమయానికి.. అమ్మా పోలీసులకు కాల్ చేయమని చెప్పాడు. వాడు వచ్చేస్తున్నాడు, నేను చచ్పిపోతానని భయపడుతూ చెప్పాడు. బాత్రూంలో చాలామంది గాయపడ్డారని తల్లికి చెప్పాడు.

ఆ తర్వాత కాసేపు సందేశం రాకపోయేసరికి ఆమె కంగారు పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికి... ఇంకా బాత్రూంలోనే ఉన్నానని, అతను మమ్మల్ని బయటకు రమ్మంటున్నాడని మెసేజ్ పెట్టాడు. మరి కాసేపటికి.. వాడు మాతోనే ఉన్నాడని, అతనో ఉగ్రవాది అని చెప్పాడు. ఆ తర్వాత అతని నుంచి సందేశం రాలేదు. అతను చనిపోయాడా, బతికి ఉన్నాడా తెలియదని కంటతడి పెడుతోంది.

నన్నూ చంపేసేవాడు: మాజీ భార్య స్పందన

ఓర్లాండో దాడి వార్త వినగానే ఒమర్ మతీన్ మాజీ భార్య స్పందించింది. వాడక పిచ్చివాడని, రోజూ తనను చిత్రహింసలు పెట్టేవాడని, వాడితో కలిసి జీవించిన రెండేళ్లలో నరకం అనుభవించానని చెప్పింది.

ఎనిమిదేళ్ల క్రితం అతనితో తనకు పరిచయం ఏర్పడిందని, 2009లో పెళ్లి చేసుకున్నామని చెప్పింది. తొలుత బాగానే ఉన్నా, క్రమంగా అతనిలో క్రూరత్వం బయటపడిందని చెప్పింది. ఆ తర్వాత అతనిని భరించడమే కష్టంగా మారిందని తెలిపింది.

ఇంటికి వచ్చీ రాగానే, చిరాకుగా కనిపించేవాడని, ఏదో సాకుతో గొడవపడేవాడని, తనను గొడ్డులా బాదేవాడు అని తెలిపింది. ఇంటికి వచ్చీరాగానే నన్ను హింసించడమే పనిగా పెట్టుకునే వాడు. బట్టలు ఉతకలేదంటూ, ఇల్లు సరిగా లేదంటూ సాకులు చూపుతూ తీవ్రంగా కొట్టేవాడు. మానసికంగా స్థిరంగా ఉండేవాడు కాదు.

చూడడానికి మామూలుగా కనిపించే అతను, మతపరమైన అంశాల్లో కఠినంగా ఉండేవాడని, తనను కొట్టేటప్పుడు అతని తండ్రి అడ్డుపడేవాడని తెలిపింది. కన తల్లిదండ్రుల చొరవతో ఆ నరకం నుంచి బయటపడ్డానని చెప్పింది. ఓర్లాండులో 50 మంది మృతి చెందిన విషయం తెలియగానే.. ఉద్వేగానికి గురయింది. నేను నిజంగా అదృష్టవంతురాలిని అని, కలిసి ఉంటే నన్నూ చంపేసేవాడని పేర్కొంది.

ఒబామా ఖండన

ఓర్లాండో క్లబ్ నరమేధం ద్వేషపూరిత దాడి అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఇది యావత్ అమెరికా పైన జరిగిన దాడి అని ఆయన అన్నారు. దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతి ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+