Sheikh Hasina కు మరణ శిక్ష- 1,400 మందిని చంపిన నరహంతకి: మాజీ హోం మంత్రికీ ఉరి..!!

పదవీచ్యుతురాలైన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరణ శిక్ష పడింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ (ICT) కోర్టు తుది తీర్పు వెలువడించింది. 2024 జులై- ఆగస్టు మధ్య సంభవించిన హింసాత్మక నిరసనల ప్రదర్శనలకు ఆమెను బాధ్యురాలిగా గుర్తించింది న్యాయస్థానం. అప్పట్లో ఈ అల్లర్లల్లో 1,400 మందికి పైగా మరణించారు. వారందరి మరణానికీ షేక్ హసీనా బాధ్యురాలని తేల్చి చెప్పింది.

ఆ దేశ మాజీ హోం శాఖ మంత్రి అసదుజ్జామన్ ఖాన్ కమల్‌కు కూడా ప్రత్యేక ట్రిబ్యునల్ ఉరిశిక్షను విధించింది. పదవిని నిలుపుకోవడానికి, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగిన విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేయడానికి షేక్ హసీనా, ఖాన్ కమల్.. నరమేధానికి పాల్పడినట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన ఈ నేరాలకు ఇద్దరూ ప్రధాన సూత్రధారులుగా తేల్చింది. ఇదే నేరంతో ప్రమేయం ఉన్న మాజీ పోలీసు జనరల్ ఇన్‌స్పెక్టర్ చౌదరి అబ్దుల్లా అల్ మామున్‌ కు అయిదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది.

Ousted Prime Minister Sheikh Hasina Faces Death Sentence

ఆయనకు శిక్షను తగ్గించడానికి కారణాలు లేకపోలేదు. షేక్ హసీనా, ఖాన్ కమల్ కు వ్యతిరేకంగా ట్రిబ్యునల్‌కు సరైన సాక్ష్యాధారాలను ఆయన సమర్పించారు. సమగ్ర న్యాయ విచారణ జరగడానికి సంపూర్ణంగా సహకరించారు. దోషులకు మరణశిక్షవిధిస్తూ సరైన తీర్పు రావడానికి అవసరమైన సహకారాన్ని అందించినందుకు చౌదరి అబ్దుల్లా అల్ మామూన్ కు శిక్షను తగ్గించినట్లు కోర్టు పేర్కొంది. ఆయనకు ఉపశమనాన్ని కల్పిస్తూ, అయిదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించినట్లు కోర్టు పేర్కొంది.

గత సంవత్సరం జరిగిన విద్యార్థి నిరసనల సమయంలో జరిగిన దాడులు వ్యవస్థీకృతమైనవని కోర్టు పేర్కొంది. నిరసనకారులను చంపడం, తీవ్రంగా గాయపరచడం వంటి దారుణాలకు నిందితులు పాల్పడ్డారని వ్యాఖ్యానించింది. షేక్ హసీనా తన రెచ్చగొట్టే ఆదేశాల ద్వారా అల్లర్లను మరింత ప్రోత్సహించారని, నిరసనకారులపై ప్రాణాంతక దాడులు సాగించడానికి నాటి హోం శాఖ మంత్రి ఖాన్ కమల్ పకడ్బందీగా పథక రచన చేశారని పేర్కొంది.

డ్రోన్లు, హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించమని షేక్ హసీనా ఆదేశించారని, దీనిద్వారా ఛార్జ్ నంబర్ 2 కింద మానవత్వానికి వ్యతిరేకంగా నేరానికి పాల్పడ్డారని కోర్టు పేర్కొంది. మొత్తం మూడు నేరాల్లో ఆమెకు ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాధారాలను న్యాయవాదులు సమర్పించారని వివరించింది. షేక్ హసీనాకు మరణశిక్ష పడగానే.. కోర్టు ఆవరణలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.

తీర్పును ప్రత్యక్షంగా చూడటానికి వచ్చిన ప్రజలు, ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో ఉద్యమాలు చేపట్టిన సంఘాల ప్రతినిధులు.. చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. రాజధాని ఢాకా సహా బంగ్లాదేశ్ లోని ప్రధాన నగరాల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. కోర్టు తీర్పును స్వాగతిస్తూ ప్రజలు రోడ్లపై ర్యాలీలు చేయడం కనిపించింది. సోమవారం కోర్టు తీర్పునకు ముందు ఢాకా అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎటువంటి అల్లర్లకు పాల్పడినా కాల్చివేయాలని సూచించారు. షూట్ అట్ సైట్ ఆదేశాలను జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+