Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పంజ్‌షిర్ భీకర పోరు: 300 మందికిపైగా తాలిబన్లు హతం, 130 మందిని ఖైదు చేశారు

కాబూల్: ఆప్ఘనిస్థాన్ మొత్తాన్ని ఆక్రమించుకున్నామని చెప్పుకుంటున్న తాలిబన్లకు పంజ్‌షిర్ ప్రాంతం మాత్రం చుక్కలు చూపిస్తోంది. పంజ్‌షిర్ కోసం తాలిబన్లు ఓ వైపు చర్చలు జరుపుతామంటూనే.. మరోవైపు దాడులకు తెగబడ్డారు. దీంతో పంజ్‌షిర్ ప్రాంతంలోని ఉత్తరాది దళాలు తాలిబన్లపై విరుచుకుపడ్డాయి. వందలాది మంది తాలిబన్లను హతమార్చాయి. అనేక మందిని బందీలుగా చేసుకున్నాయి.

కాగా, అమెరికా దళాలు పూర్తిగా నిష్క్రమించడంతో త్వరలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తాలిబన్లు.. పంజ్‌షిర్‌ను కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడమే లక్ష్యంగా ఆ ప్రాంతం నేతలను బుధవారం చర్చలకు పిలిచారు. పర్వాన్ ప్రాంతంలో పంజ్‌షిర్ కు చెందిన నేతలు, గిరిజన తెగలతో జరిపిన ఈ చర్చలు విఫలమైనట్లు తాలిబన్ల ప్రతినిధి ముల్లా అమిర్ ఖాన్ ముత్తాకి మీడియాకు తెలిపారు.

 Over 300 Taliban Terrorists Killed In Panjshir Battle, 130 captured

పంజ్‌షిర్ ఫైటర్లు ఆయుధాలు వీడి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం పంజ్‌షిర్‌ లోయ ప్రజలే వారిని ఒప్పించాలని తాలిబన్లు సూచిస్తున్నారు. కాగా, చర్చలు జరుపుతూనే పంజ్‌షిర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. దీనికి ధీటుగా బదులిచ్చాయి పంజ్‌షిర్ బలగాలు. ఉత్తరకూటమి దళాలు జరిపిన దాడుల్లో వందలాది తాలిబన్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు వీరి మధ్య జరిగిన యుద్ధంలో 350 మంది తాలిబన్ ఫైటర్లను మట్టుబెట్టినట్లు ఉత్తర కూటమి దళాలు ప్రకటించాయి. మరో 130 మందికిపైగా తాలిబన్ ఫైటర్లను బంధీలుగా చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాయి. పంజ్‌షిర్ తీవ్ర ప్రతిఘటనతో తాలిబన్లు చేదు అనుభవమే ఎదురైంది. దీంతో మొత్తం ఆప్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకున్నా ఈ ప్రాంతం మాత్రం తమ చేతిలోకి రాకపోవడంతో తాలిబన్లు నిరాశలో ఉన్నారు. అంతేగాక, పంజ్‌షిర్ ఆక్రమణకు కుట్రలకు తెరతీశారు తాలిబన్లు. ఆ ప్రాంతానికి ఆహార పదార్థాలను కూడా నిలిపివేస్తున్నారు.

తాలిబన్ల సాయం కోరుతూ కాశ్మీర్‌పై కుట్రలు చేస్తున్న ఉగ్రవాదులు

ఆప్ఘనిస్తాన్ లో ఒకప్పుడు తాలిబన్లతో స్నేహం చేసి దాదాపు రెండు దశాబ్దాల పాటు వారిని తీవ్రవాదులుగా ప్రపంచం దృష్టిలో నిలబెట్టిన ఉగ్రవాద సంస్ధ అల్ ఖైదా ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తోంది. ఆప్ఘనిస్తాన్ నుంచి యూఎస్ బలగాలు వెనుదిరిగిన నేపథ్యంలో ఆ దేశంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న అల్ ఖైదా అంతకు ముందే తాలిబన్లకు శుభాకాంక్షలు తెలిపింది. ఆప్ఘన్ గడ్డను స్వాధీనం చేసుకున్నందుకు వారికి కంగ్రాట్స్ చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల విజయానికి కంగ్రాట్స్ చెప్పిన అల్ ఖైదా అంతటితో ఆగకుండా కశ్మీర్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం శత్రువుల చేతుల్లో ఉన్న ప్రాంతాలకూ విముక్తి కల్పించాలని పిలుపునిచ్చింది. కశ్మీర్ తో పాటు పాలస్తీనా, లెవాంట్, సోమాలియా, యెమన్ కూడా విముక్తి కల్పించాలని తాలిబన్లకు అల్ ఖైదా ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా బందీలుగా ఉన్న ముస్లింలకూ విముక్తి కల్పించాలని అల్లాహ్ ను ప్రార్ధిస్తున్నట్లు వెల్లడించింది.

గతంలో ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారంలో ఉన్న సమయంలోనే అమెరికాలో అల్ ఖైదా 9/11 దాడులు చేసింది. అమెరికా విమానాలతోనే వారి దేశంలోని డబ్ల్యూటీసీ టవర్లపై విరుచుకుపడింది. అమెరికాతో పాటు ప్రపంచాన్నే గడగడలాడించిన ఈ ఘటన తర్వాత అగ్రరాజ్యం అల్ ఖైదాపై విరుచుకుపడటం మొదలుపెట్టింది. ఇదే క్రమంలో అల్ ఖైదా స్ధావరంగా ఉన్న ఆప్ఘనిస్తాన్ పైనా దాడులకు దిగింది. పర్యవసానంగా తాలిబన్లు అధికారం కోల్పోవడంతో అక్కడ పాశ్చాత్యదేశాల కన్నుసన్నల్లో ఉండే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తర్వాత భారత్ వంటి దేశాలు కూడా ఆప్ఘనిస్తాన్ లో భారీగా పెట్టుబడులు పెట్టడంతో పాటు మౌలిక సదుపాయాలు అభినృద్ధి చేశాయి. తిరిగి ఇన్నాళ్లకు తాలిబన్లకు అధికారం దక్కింది.

ఆప్ఘనిస్తాన్ లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి అధికారం చేపట్టబోతున్న తాలిబన్లను రెచ్చగొట్టేందుకే అల్ ఖైదా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం మారిన పరిస్దితుల్లో తాలిబన్లు అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే తాలిబన్ ప్రభుత్వానికీ, ఆయా దేశాలకూ మధ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అది అల్ ఖైదాకు ఇష్టం లేదు. అలా జరిగితే అల్ ఖైదా ప్రాబల్యం భారీగా తగ్గిపోతుంది. దీంతో అనుకూల పరిస్ధితుల్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆప్ఘన్ గడ్డపై అడుగుపెట్టేందుకు అల్ ఖైదా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+