పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన ట్రంప్-పుతిన్:ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్..!!

Pahalgam Terror Attack:భూతల స్వర్గంగా పర్యాటకులను ఆకర్షించే జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతం ఒక్కసారిగా రక్తసిక్తమైంది! పచ్చని మైదానాల మధ్య ఆహ్లాదంగా గడుపుతున్న అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన అమానుష దాడిలో ఏకంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ దారుణ మారణహోమం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని నింపగా, ప్రపంచ దేశాల నుంచి కూడా ఈ కిరాతక చర్యపై తీవ్ర ఖండన వ్యక్తమైంది.ఈ కిరాతక చర్యను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సహా పలువురు ప్రపంచ నేతలు తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు అండగా నిలుస్తామని అమెరికా స్పష్టం చేసింది.

pahalgam-terror-attack-donald-trump-and-putin-condemn-the-brutal-attack-says-they-are-with-india

ప్రపంచ అగ్రనేతల తీవ్ర ఖండన: భారత్‌కు అండగా నిలుస్తామని హామీ

  • అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్: ఈ దాడిని "తీవ్రంగా కలచివేసేది"గా అభివర్ణించిన ట్రంప్,తీవ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా భారత్‌కు అండగా నిలుస్తుందన్నారు.ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని తామంతా ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి మోదీకి, భారత ప్రజలకు తమ పూర్తి మద్దతు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

  • అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్: ప్రస్తుతం నాలుగు రోజుల పర్యటనకు భారత్‌కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పహల్గాం ఉగ్రదాడిపై స్పందించారు. తన భార్యతో కలిసి బాధితులకు సంతాపం తెలిపారు జేడీ వాన్స్. భారతదేశ సౌందర్యం, ప్రజలు తమను ముగ్ధులను చేశారని కొనియాడిన వాన్స్ దంపతులు,దుఃఖంలో ఉన్న వారికోసం ప్రార్థనలు చేస్తున్నట్లు ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.

  • రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్: రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీలకు సంతాపం తెలుపుతూ, ఈ దాడిని "న్యాయబద్ధత లేని క్రూరమైన నేరం"గా పుతిన్ ఖండించారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భారత్‌కు అన్ని రకాల సహాయసహకారాలను అందిస్తామని వెల్లడించారు. నిందితులను వెంటనే పట్టుకుని శిక్షించాలని ఆయన కోరారు.

ఆనంద క్షణాల్లో ఆకస్మిక మృత్యుఘోష
పహల్గామ్ సమీపంలోని ప్రసిద్ధ బైసరాన్ మైదానంలో మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సైనిక దుస్తులు ధరించిన ఉగ్రవాదుల బృందం పర్యాటకులు గుమికూడి ఉన్న చోటికి వచ్చి, కనీసం హెచ్చరిక లేకుండా విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించింది. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే తూటాలు దూసుకురావడంతో పర్యాటకులు నేలకొరిగారు. ఘటనా స్థలంలో మృతదేహాలు పడివున్న దృశ్యాలు, ప్రాణ భయంతో కేకలు పెడుతున్న మహిళలు, చిన్నపిల్లలు, వారిని కాపాడటానికి ప్రయత్నిస్తూ గాయాలపాలైన స్థానికుల ఆక్రందనలు అక్కడ నెలకొన్న భీభత్సాన్ని కళ్ళకు కట్టాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+