పాక్ బ్లాస్ట్‌లో 25మంది, కెన్యా కాల్పుల్లో 43మంది మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని పెషావర్ నగరంలో ఒక ప్రార్థనా మందిరం వద్ద బాంబు పేలిన ఘనలో 25 మంది మృతి చెందగా, 45 మంది గాయపడ్డారు. ప్రార్థనా మందిరం నుండి జనం బయటకు వస్తున్న సమయంలో ఓ ఉగ్రవాది బాంబుతో తనను తాను పేల్చుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ ప్రాంతంలో ఓ మతానికి చెందిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆదివారం కావడంతో ప్రార్థన చేసుకునేందుకు చాలామంది వచ్చారు. ప్రార్థనల అనంతరం బయటకు వెళ్తుండగా ఆత్మాహుతి దాడి జరిగడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈ ప్రాంతంలో మార్కెట్, షాపింగ్ మాల్స్ ఉండటంతో రద్దీగా ఉంటుంది.

Pak: 25 killed as suicide bomber attacks church in Peshawar

కెన్యాలో కాల్పుల్లో 39 మంది మృతి

పలువురు ఉగ్రవాదులు కెన్యాలోని ఓ షాపింగ్ మాల్‌లో కాల్పులు జరపడంతో 43 మంది మృతి చెందారు. ఈ ఘటన శనివారం జరిగింది. మొదట 39 మంది చనిపోయారని వార్తలు వచ్చినప్పటికీ ఆదివారం మధ్యాహ్నానికి 43 అని తెలుస్తోంది. ఈ ఘటనలో 200 మందికి పైగా గాయపడ్డారు.

ఈ ఘటన జరిగినప్పుడు షాపింగ్ మాల్‌లో అమెరికన్స్, బ్రిటిష్, కెనడియన్స్, భారతీయులు ఉన్నారు. అల్ షహబ్ అనే టెర్రరిస్టు సంస్థ ఈ దారుణానికి ఒడిగట్టింది. తీవ్రవాదులు ఇతర వర్గాలను లక్ష్యంగా చేసుకున్నారు. కాగా, మరిన్ని దాడులకు పాల్పడతామని హెచ్చరించడంతో కెన్యా అప్రమత్తమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+