ఉగ్రవాదుల తయారీ కేంద్రం: ఐరాసలో పాక్‌ పరువు తీసిన భారత్

Subscribe to Oneindia Telugu

జెనీవా: ఐక్య రాజ్య స‌మితి వేదిక‌గా పాకిస్థాన్‌ ఉగ్రవాద కార్యకలాపాలను భారత్ ఎండగట్టింది. ప్రపంచ ఉగ్రవాద తయారీ ఫ్యాక్టరీ పాకిస్థాన్ అంటూ దిమ్మదిరిగేలా జవాబిచ్చింది. భారత భూభాగాలను పాక్ అక్రమంగా ఆక్రమించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. జెనీవాలో జ‌రుగుతున్న యూఎన్ మాన‌వ‌హక్కుల కౌన్సిల్ స‌మావేశంలో భాగంగా పాక్ తీరుపై భార‌త్ మండిప‌డింది.

పాక్ ప్ర‌పంచ ఉగ్ర‌వాదుల ప్యాక్ట‌రీయేకాదు.. దేశంలోని మైనార్టీలైన హిందువులు, క్రిస్టియ‌న్లు, షియాలు, అహ్మ‌దీయుల‌ను తీవ్రంగా హింసిస్తున్న‌ద‌ని భార‌త్ స్ప‌ష్టంచేసింది. అంతేగాక, భారత్ అంతర్భాగమైన గిల్గిత్-బాల్టిస్థాన్‌ను ఐదో రాష్ట్రంగా ప్రకటించేందుకు పాక్ సిద్ధమైన వేళ పాక్ తీరును భారత్.. ఐరాసలో ఎండగట్టింది.

'మా దేశంలో మైనార్టీలు ప్ర‌ధాన‌మంత్రులు, రాష్ట్ర‌ప‌తులు, ఉప‌రాష్ట్ర‌ప‌తులు, సీనియ‌ర్ కేబినెట్ మంత్రులు, సీనియ‌ర్ సివిల్ స‌ర్వెంట్స్‌, క్రికెట్ టీమ్స్ కెప్టెన్స్‌, బాలీవుడ్ సూప‌ర్‌స్టార్స్‌గా ఉన్నారు. పాక్‌లో మైనార్టీలను అస‌లు ఇలా ఊహించ‌గ‌ల‌మా? వాళ్ల మ‌తాల‌ను దూషించ‌డం, మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌, వేధింపులు.. ఇవే ఎదుర‌వుతాయి' అని భార‌త ప్ర‌తినిధి న‌వ‌నీతా చక్ర‌వ‌ర్తి పాక్‌ను క‌డిగిపారేశారు.

యూఎన్ అత్యున్న‌త వేదిక‌ను పాక్ మ‌రోసారి దుర్వినియోగం చేసింద‌ని, జ‌మ్మూకాశ్మీర్‌లాంటి భార‌త్ అంత‌ర్గత వ్య‌వ‌హారాల‌పై మాట్లాడ‌టం స‌రికాద‌ని ఆమె స్ప‌ష్టంచేశారు. భార‌త్‌లో హింస‌ను, ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హించ‌డం పాక్ మానుకోవాలని గట్టిగా హెచ్చరించారు.

'మా అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో జోక్యం త‌గ‌దు అని పాక్‌కు చెప్పాల‌నుకుంటున్నాం' అని చ‌క్ర‌వ‌ర్తి అన్నారు. భార‌త్‌లోని జ‌మ్మూకాశ్మీర్‌లో పూర్తి ప్రజాస్వామ్యం ఉండ‌గా.. పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ మాత్రం ఉగ్ర‌వాదుల త‌యారీ కేంద్రంగా మారిందని ఆమె విమ‌ర్శించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Lashing out at Pakistan for interfering in India's internal matters, India on Wednesday said that Pakistan has become 'world's terrorism factory' and alienating its own people by mistreating minorities.
Please Wait while comments are loading...