టైం కాదు: భారత్ హైకమిషనర్‌పై పాక్ మంత్రి, మోడీపై..
న్యూయార్క్: భారత్‌లోని తమ హైకమిషనర్ కాశ్మీర్‌కు చెందిన హురియత్ నాయకులను కలుసుకున్న సమయం సరైనది కాదని పాకిస్తాన్ విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. కాశ్మీర్ వేర్పాటువాద నేతలతో పాక్ హైకమిషనర్ సమావేశం కావడానికి నిరసనగా రెండు దేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని రద్దు చేశారు.
గత 30 సంవత్సరాలుగా పాకిస్తాన్ దౌత్యవేత్తలు హురియత్ నాయకులను కలుసుకోవడం ఓ ఆనవాయితీగా మారినప్పటికీ, ఢిల్లీలోని తమ హైకమిషనర్ మాత్రం ఈ సమావేశం జరపడం అప్పటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా సరైనది కాదని అజీజ్ అంగీకరించారు.

అయితే ఈ రకమైన సమావేశాలు జరగడం కొత్త కాకపోయినా భారత జాతీయ రాజకీయాల్లో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకుని తమ హైకమిషనర్ వ్యవహరించి ఉండాల్సిందని అజీజ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు కాశ్మీర్ విషయంలో అర్థవంతమైన చర్చ జరగలేదని, ఈ నేపథ్యంలో కాశ్మీర్ నేతలతో సమావేశమయ్యే తమ హక్కును ఎంతమాత్రం కోల్పోలేమన్నారు.
అయితే విదేశాంగ కార్యదర్శుల సమావేశానికి ముందే భారత్ నుంచి తమకు ఈ విషయమై సంకేతాలు అందితే వాటిని పరిగణనలోకి తీసుకునే వారమన్నారు. కానీ ఈ సమావేశం విషయంలో భారత్ నుంచి చివరి క్షణంలోనే అభ్యంతరాలు అందాయని, అప్పటికే హురియత్ నేతలకు హైకమిషనర్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయన్నారు. మరోవైపు, భారత్, పాక్‌లు సత్వర ప్రాతిపదికన చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని ఐక్యరాజ్య సమితిలో మోడీ ఇచ్చిన పిలుపు ప్రోత్సాహకరంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications