Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాక్‌పై పెరుగుతున్న ఒత్తిడి: మసూద్ అజార్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలంటూ యూఎన్‌కు అమెరికా

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడులు, ఆ తర్వాత ప్రతీకార చర్యలకు భారత్ దిగడం..ఆ మరుసటి రోజు పాక్ భారత గగనతలంలోకి రావడం.. అనంతరం భారత వింగ్ కమాండర్ పైలట్‌ను తమ అధీనంలోకి తీసుకోవడాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ప్రపంచ దేశాలు ఒక్కతాటిపైకొచ్చాయి. పాక్ పై భారత్‌తో పాటు పలు దేశాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరైపోయింది.

ఫిబ్రవరి 14న జైషే ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది భారత జవాన్ల కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ పై తీవ్రమైన ఒత్తిడి ప్రపంచదేశాల నుంచి వస్తోంది. తాజాగా అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలు పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని ఆశ్రయించాయి. జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజర్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలని ఒత్తిడి తెస్తున్నాయి.

Pak isolated: US Britain and France move UNSC, demands to blacklist Masood Azhar

ఈ మూడు దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతా సమాఖ్యలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. మరో శాస్వత సభ్యత్వం కలిగిన దేశం చైనా మాత్రం మసూద్ అజర్‌కు అండగా నిలుస్తోంది. అజర్ పై ఆంక్షలు విధించాలని ఐక్యరాజ్యసమితి నాడు భావించినప్పటికీ 2016లో 2017 ఈ నిర్ణయాన్ని చైనా వ్యతిరేకించింది.

జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజర్ పై ఆర్థిక ఆంక్షలు, ఆయుధాలపై ఆంక్షలు, ఆస్తులపై ఆంక్షలు విధించాలని బ్రిటన్, అమెరికా ఫ్రాన్స్ దేశాలు ఐక్యరాజ్యసమితిని కోరుతున్నాయి. అయితే కమిటీ అందరి ఏకాభ్రిప్రాయం మేరకే నడుచుకుంటుంది. ఇదిలా ఉంటే మిగతా శాశ్వత సభ్య దేశాలు కూడా తమ నిర్ణయాన్ని వెల్లడించేందుకు మార్చి 13 వరకు గడువు ఇచ్చింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమాఖ్య. ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్స్ సిద్ధంగా ఉన్నట్లు యూఎన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+