అమ్మాయిలతో బెడ్ షేర్ చేసుకొంటే భారీగా ఫైన్, యూనివర్శిటీ వింత నిబంధన

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇస్లామాబాద్: అమ్మాయిల హాస్టల్ లో బెడ్ షేర్ చేసుకొంటే జరిమానా విధించనునన్నట్టు పాకిస్తాన్ లోని ప్రఖ్యాత ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్శిటీ నోటీఫికేషన్ జారీచేసింది. అమ్మాయిలతోనే బెడ్ షేర్ చేసుకొంటే ఈ జరిమానాను విధించనున్నట్టు ప్రకటించింది.బెడ్ పై కూర్చొన్నా కాని ఈ జరిమానా తప్పదని హెచ్చరించింది.

పాకిస్తాన్ లోని ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్శిటీ తీసుకొన్న ఈ నిర్ణయం పలు విమర్శలకు తావిస్తోంది. వర్విటీలోని అమ్మాయిల హాస్టల్ లో పడకను పంచుకోవడాన్ని నిషేధించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.

37 ఏళ్ళ చరిత్ర గల ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న హాస్టల్ లో అమ్మాయిలు తమ స్నేహితుల (అమ్మాయిలే)తో గాలని, అక్కా చెల్లెళ్ళతో గానీ బెడ్ షేర్ చేసుకొంటే ఫైన్ తప్పదు.

bed sharing

ఒకే దుప్పటి కప్పుకొన్నా, పడుకొన్నా, కూర్చొన్నా భారీగా జరిమానా తప్పదని హెచ్చరించింది యూనివర్శిటీ.పడకల మధ్య సహేతుకమైన దూరాన్ని పాటించాలని సూచించింది. ప్రత్యేకంగా అమ్మాయిల హాస్టళ్ళలోనే ఈ విధంగా నిబంధలను అమలు చేయడంపై సోసల్ మీడియాలో తీవ్రమైన చర్చసాగుతోంది.

అబ్బాయిల హాస్టళ్ళలో పెద్ద సంఖ్యలో నాన్ బోర్డర్ లు మకాం వేసినా పట్టించుకోకుండా అమ్మాయిల హాస్టళ్ళలోనే ఈ విధంగా ఆంక్షలు విధించడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. అయితే, ఈ హాస్టళ్ళలో స్థలం సమస్య ఉందని, అంతేకాకుండా అమ్మాయిలు తమ వెంట బంధువులు, కుటుంబసభ్యులను ఉంచుకోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని యూనివర్శిటీ చెబుతోంది. ఈ కారణంగానే తాము ఈ నోటిఫికేషన్ ను జారీ చేసినట్టు యూనివర్శిటీ ప్రకటించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In what can be termed as a bizarre move, a well known university in Pakistan has banned "bed sharing" in girls' hostels.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి