మేం సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తే: పాక్ ఆర్మీ చీఫ్, భారత్ హద్దుల్లో ఉండాలి: ఎయిర్ ఫోర్స్ చీఫ్
పాకిస్తాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ సోహైల్ అమన్ భారత్ పైన తీవ్ర వ్యాఖ్యలతో గురువారం విరుచుకు పడ్డాడు. పాక్ కనుక సర్జికల్ స్ట్రయిక్ దాడులకు దిగితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించాడు.
కరాచీ: మరో నాలుగు రోజుల్లో రిటైర్ కాబోతున్న పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ భారత్‌పై విద్వేష ప్రచారాన్ని ఏ మాత్రం తగ్గించడం లేదు. ఖైబర్ ప్రాంతంలో జరిగిన సమావేశంలో మాట్లాడాడు. భారత్‌పై పాక్ సర్జికల్ స్ట్రయిక్స్ జరిపితే భారత్ తరతరాలు గుర్తు పెట్టుకునేవిధంగా ఉంటాయని హెచ్చరించాడు.
సంయమనం పాటిస్తున్నా భారత్ దాడులకు పాల్పడితే తిప్పికొట్టగలమన్నారు. భారత్ పైన మేం సర్జికల్ దాడులకు దిగితే అవి భారత్ పాఠ్య పుస్తకాలలోకి ఎక్కుతాయని, సర్జికల్ దాడులు అంటే దానికి పాక్ చేసే దాడులను పాఠ్య పుస్తకాలలో ఉదాహరణంగా పేర్కొంటారన్నాడు. పాక్ భూభాగంలో భారత్ సర్జికల్ దాడులను కొట్టి పారేశాడు. భారత్‌కు గుణపాఠం చెప్పేందుకు తమ దళాలు సిద్ధంగా ఉన్నాయన్నాడు.

హద్దుల్లో ఉండాలి: ఎయిర్ ఫోర్స్ చీఫ్
కాశ్మీర్ విషయంలో భారత్, పాకిస్థాన్‌తో యుద్ధం చేయాలని అనుకుంటే వారిని ఎలా నిలువరించాలో తమకు తెలుసని పాక్ ఎయిర్ మార్షల్ చీఫ్ సొహైల్ అమన్ హెచ్చరించాడు. ఎల్వోసీ వద్ద బుధవారం భారత్ కాల్పులు జరపడంతో ముగ్గురు సైనికులతో పాటు, 12 మంది సాధారణ పౌరులు మృతి చెందినట్లు పాక్ ఆర్మీ ధ్రువీకరించింది.
కరాచీలో అమన్ మాట్లాడాడు. భారత్ హద్దుల్లో ఉంటే బాగుంటుందన్నాడు. లేదంటే వారిని ఎలా కట్టడి చేయాలో పాక్ సైన్యానికి బాగా తెలుసునని చెప్పాడు. కాగా, యూరీ ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications