వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

36 వేల అడుగుల్లో కుదుపు.. సాయం కోరిన పైలట్, తమ గగనతలంలో వెళ్లేందుకు పాకిస్థాన్ అనుమతి

|
Google Oneindia TeluguNews

జైపూర్ నుంచి మస్కట్ వెళ్తున్న భారత విమానానికి గగనతరంలో వాతావరణం అనుకూలించలేదు. దీంతో దగ్గరలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు సమాచారం ఇచ్చారు. పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించారు. తమ గగనతలంలో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. వందలాది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. గురువారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భారత విమానం గగనతలంలో ప్రయాణించే సమయంలో వాతావరణ మార్పులను ఎదుర్కొంది. దక్షిణ సింధు ప్రాంతంలో పైలట్ ఇబ్బంది పడ్డారు. వెంటనే సంబంధిత స్టేషన్లకు సమాచారం పంపారు. వెంటనే పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించారు. తమ గగనతలంలో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. దీనిని న్యూస్ ఇంటర్నేషనల్ కొట్ చేసింది.

Pakistan air traffic controller saves Jaipur-Muscat flight after pilot alert

గగనతలంలో విమానం కుదుపునకు గురైన సమయంలో అందులో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం 36 వేల అడుగుల ఎత్తు నుంచి 34 వేల అడుగులకు కిందకొచ్చింది. దీంతో పైలట్ అప్రమత్తమై.. సమాచారం ఇవ్వడంతో పాకిస్థాన్ ఎయిర్ కంట్రోల్ సిబ్బంది స్పందించారు. తదుపరి ప్రయాణాన్ని తమ గగనతలంలో వెళ్లేందుకు అనుమతినిచ్చింది.

వాస్తవానికి గగనతలంలో ఆయా దేశాలకు ఎయిర్ ట్రాఫిక్ ఉంటుంది. బాలాకోట్ దాడుల తర్వాత తమ గగనతలంలో ఇండియాకు పాకిస్థాన్ ఆంక్షలు విధించింది. సాధారణ విమానాలే గాక, వీఐపీ, వీవీఐపీ ప్లైట్లను కూడా అనుమతించలేదు. ప్రధాని మోడీ విమానానికి కూడా అనుమతి ఇవ్వలేదు. కానీ భారత పైలట్ ప్రమాద హెచ్చరికతో కాస్త కరుణ చూపి.. తమ గగనతలంలో ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చి.. ప్యాసెంజర్స్ ప్రాణాలను కాపాడింది.

English summary
air traffic controller of pakistan civil aviation authority saved a plane flying from jaipur to muscat. after its pilot sounded alert due to bad weather.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X