ట్రంప్ కు జిందాబాద్ కొట్టిన పాకిస్తాన్, 7 ముస్లిం దేశాలు: భారత్ కు చెక్?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పాకిస్తాన్ బహిరంగంగా మద్దతు ప్రకటించింది. ఇదివరకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గానీ, సైన్యాధ్యక్షుడు ఆసీమ్ మునీర్ గానీ డొనాల్డ్ ట్రంప్ తో ముఖాముఖి భేటీ అయ్యారు గానీ.. తాజాగా చోటు చేసుకుంటోన్న పరిణామాల నేపథ్యంలో ట్రంప్ వైపు నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడితో దీనికి బ్రేకులు పడలేదు. మరో ఏడు దేశాలు ట్రంప్ కు జిందాబాద్ కొట్టాయి.
గాజాలో శాశ్వత కాల్పుల విరమణ, పునర్నిర్మాణం, ప్రాంతీయ శాంతిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేయతలపెట్టిన బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరడానికి చేరాయి ఆయా దేశాలన్నీ కూడా. అందులో చేరికకు ఎనిమిది ఇస్లామిక్ దేశాలు మనస్ఫూర్తిగా అంగీకరించాయి. సంపూర్ణ మద్దతు తెలిపాయి. గాజాలో శాంతి స్థాపన కోసం ట్రంప్ చేస్తోన్న ప్రయత్నాలను స్వాగతించడంతో పాటు అందులో తాము కూడా భాగస్వామ్యులు కానున్నట్లు పేర్కొన్నాయి.

పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతర్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రులు బుధవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రతి దేశం తమ సంబంధిత చట్టపరమైన ప్రక్రియల ప్రకారం చేరిక పత్రాలపై సంతకం చేస్తాయని తెలిపారు. ట్రంప్ స్థాపించబోయే బోర్డ్ ఆఫ్ పీస్ వల్ల మధ్య- తూర్పు దేశాల్లో శాంతియుత వాతావరణం నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం ేశారు.
ఈ బోర్డ్ ఆఫ్ పీస్ కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2803వ తీర్మానం ద్వారా ఆటోమేటిక్ గా ఆమోదం లభిస్తుంది. గాజా సంఘర్షణలను ముగించడానికి ట్రంప్ ప్రతిపాదించిన సమగ్ర ప్రణాళిల్లో ఓ భాగం. శాశ్వత కాల్పుల విరమణ, గాజా పునర్నిర్మాణానికి మద్దతు ఇవ్వడం, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా పాలస్తీనా స్వీయ నిర్ణయాధికారం, రాజ్యాధికారం ఆధారంగా శాశ్వత శాంతిని సాధించడం దీని ఉద్దేశం. ఈ రీజియన్ లోని అన్ని దేశాలు, ప్రజల భద్రత, సుస్థిరతకు మార్గం సుగమం చేస్తుందని మంత్రులు పునరుద్ఘాటించారు.
Ministry of Foreign Affairs of the Kingdom of Saudi Arabia tweets, "The Foreign Ministers of Saudi Arabia, Türkiye, Egypt, Jordan, Indonesia, Pakistan, Qatar, and the UAE welcome the invitation extended to their leaders by the President of the United States of America, Donald J.… pic.twitter.com/otRWcs35Kw
— ANI (@ANI) January 21, 2026
ఇజ్రాయెల్- గాజా సంఘర్షణను ముగించడానికి హమాస్‌తో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం రెండవ దశలో భాగంగా ట్రంప్ ఈ బోర్డును స్థాపించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అల్ జజీరా తెలిపింది. ఇందులో చేరాలంటూ వివిధ దేశాధినేతలకు ఆయన ఇదివరకే ఆహ్వానాలు పంపారు. ఫ్రాన్స్ వంటి కొన్ని దేశాలు ఇందులో చేరడానికి నిరాకరిస్తోన్నాయి.
-
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications