Pakistan: పాక్ బరితెగింపు..కోల్‌కతా వరకు వస్తాం.. ప్రతీకారం తీర్చుకుంటాం..!

ఓవైపు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నా.. బుద్ధి మాత్రం మారలేదు. పొరుగు దేశం పాకిస్తాన్ మరోసారి కయ్యానికి కాలుదువ్వుతోంది. భారత్ ఏదైనా 'ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్'కు పాల్పడితే ఏకంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా వరకు వచ్చి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బరితెగించి వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే ఢిల్లీపై నిందలు వేస్తూ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచేలా శనివారం సియాల్‌కోట్‌లో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

భారత్ తన ఏజెంట్లతో ఏదైనా కృత్రిమ దాడిని సృష్టించి, దాన్ని పాకిస్తాన్‌పై నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆసిఫ్ ఆరోపించారు. "భారత్ మరో దుశ్చర్యకు ప్రయత్నిస్తే, దేవుడి దయతో మేము కలకత్తా వరకు వెళ్తాం" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పాక్ ఉన్మాదానికి పరాకాష్టగా నిలిచాయి. గత వారం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన హెచ్చరికకు స్పందనగా.. పాక్ స్పందన "వేగంగా, నిర్ణయాత్మకంగా" ఉంటుందని ఆయన బీరాలు పలికారు. నిజానికి గతేడాది ఆగస్టులో కూడా పాక్ సైన్యం ఇలాగే తూర్పు సరిహద్దుల నుండి భారత్‌లోకి లోతుగా దాడులు చేస్తామని హెచ్చరించడం గమనార్హం.

Pakistan s Audacious Threat Defence Minister Khawaja Asif Vows to Reach Kolkata if India Acts Against Pak

మంట పెడుతున్న 'అబ్దుల్ బాసిత్' అణు వ్యాఖ్యలు..

రక్షణ మంత్రి వ్యాఖ్యలు ఒకెత్తయితే, మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన సూచనలు మరింత వివాదాస్పదంగా మారాయి. ఒకవేళ అమెరికా పాక్ అణు ఆయుధాలను టార్గెట్ చేస్తే, దానికి బదులుగా భారత్‌లోని ముంబై, న్యూఢిల్లీ వంటి నగరాలపై దాడి చేయాలని ఆయన విషం కక్కారు. "ఎవరైనా మాపై దుష్ట దృష్టి వేస్తే, మేము సంకోచం లేకుండా భారతీయ నగరాలపై విరుచుకుపడతాం" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పాక్ నాయకత్వంలోని వికృత ఆలోచనలను బయటపెట్టాయి.

'ఆపరేషన్ సింధూర్' సెగలు..

గత ఏడాది ఏప్రిల్ 22న పహల్‌గామ్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకోవడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీనికి ప్రతిగా భారత్ 'ఆపరేషన్ సింధూర్' ప్రారంభించి ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. అప్పట్లో ఇస్లామాబాద్ మోకాళ్లపైకి వచ్చి కాల్పుల విరమణ కోరడంతో ఢిల్లీ తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. అయితే, ఉగ్రవాదులకు, వారిని పెంచి పోషిస్తున్న పాక్ సైన్యానికి తేడా లేదని భారత్ అప్పట్లోనే కుండబద్దలు కొట్టింది. ఇప్పుడు మళ్ళీ పాక్ నేతలు చేస్తున్న ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరిహద్దుల్లో మళ్ళీ మంటలు పుట్టించేలా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+