వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పర్వతాల్లో పాక్ 2వరాజధాని: ఇస్లామాబాద్‌కు సొరంగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: మార్గల్లా పర్వత ప్రాంతంలో పాకిస్తాన్ మరో రాజధానిని నిర్మించేందుకు సిద్ధమైంది. 12 బిలియన్ డాలర్లతో ఈ రెండో రాజధానిని నిర్మించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ కొత్త రాజధానిని ప్రస్తుత రాజధాని ఇస్లామాబాద్‌తో సొరంగ మార్గం ద్వారా కలపనుంది. భారీ ప్రాజెక్టులో భాగంగా పలు నిర్మాణ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు.

ఈ రెండో రాజధాని ప్రాజెక్టు ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ డైరెక్షన్‌లో జరుగుతున్నాయట. రాజధాని అభివృద్ధి సంస్థ ఇందు కోసం అహర్నిషలు కృషి చేస్తోందట. పాకిస్తాన్ రెండో రాజధానికి సంబంధించి మీడియాలో వార్తలు వచ్చాయి. రావల్పిండి - ఇస్లామాబాద్ మధ్య రెండు రింగు రోడ్డులు, రావల్పిండిలోని రావత్ వద్ద ఒక కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణం కూడా ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.

Pakistan

కొత్త విమానాశ్రయం లాహోర్-ఇస్లామాబాద్ మోటర్ వేకు అనుసంధానిస్తారు. బ్లూ ఏరియా నుంచి రావత్ వరకూ ఉన్న ఇస్లామాబాద్ హైవేను 8 నుంచి పది లైన్లకు విస్తరించడంతోపాటు రోడ్డుకు ఇరువైపులా దుబాయ్‌లోని షేక్ జాయెద్ రోడ్డు తరహాలో బహుళ అంతస్తుల వాణిజ్య భవనాలను కూడా నిర్మించనున్నారు.

ఇస్లామాబాద్ హైవేకు ఇరువైపుల ఉన్న ప్లాట్లను వాణిజ్య అవసరాలకు ఇవ్వడం ద్వారా భారీ మొత్తంలో డాలర్లను రాబట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

English summary
Pakistan is planning an ambitious $12 billion 
 
 project that includes building a twin capital city 
 
 across the scenic Margalla Hills and connecting it 
 
 with Islamabad through a tunnel, a media report said 
 
 on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X