కాశ్మీర్ ఇష్యూ, సుమిత్ర నో: చేతులెత్తేసిన పాక్, సైఫ్ - కత్రిన సినిమాపై బ్యాన్
న్యూఢిల్లీ: వచ్చే వారం జరగాల్సిన కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సదస్సును పాకిస్తాన్ రద్దు చేసింది. కాశ్మీర్ సభాపతిని ఆహ్వానించాలని భారత్ పట్టుబట్టింది. అయితే, అందుకు పాకిస్తాన్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ల సదస్సును రద్దు చేసింది.
కాశ్మీర్ సభాపతిని కామన్వెల్త్ దేశాల సదస్సుకు ఆహ్వానించకుంటే తాము భేటీని బహిష్కరిస్తామని భారత్ హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ భేటీనే రద్దు చేయడం గమనార్హం.
సుమిత్రా మహాజన్ వేసిన చిత్తుకు పాక్ చిత్తయిందని చెప్పవచ్చు. భారత్‌లోని స్పీకర్లందరికీ ఆహ్వానం పంపిన పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ స్పీకర్‌కు మాత్రం పంపించలేదు. దీంతో తాము భేటీని బహిష్కరిస్తామని, స్పీకర్ సుమిత్రా మహాజన్ పాక్‌కు స్పష్టం చేశారు.

తద్వారా జమ్మూ కాశ్మీర్ సభాపతికి మద్దతివ్వడమే కాకుండా భారత్ మొత్త ఏకతాటిపై నిలిచింది. జమ్మూ కాశ్మీర్‌ను ఆహ్వానిస్తేనే ఐక్య రాజ్యసమితి నిబంధనలు ఉల్లంఘించినట్లని పాకిస్తాన్ నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. చివరకు భారత్ హాజరు కాకుంటే కామన్వెల్త్ భేటీ నిర్వహించలేమని చేతులెత్తేసింది.
కాగా, కాశ్మీర్ అంశంపై మూడో వ్యక్తి జోక్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించమని బీజేపీ చెప్పింది. ఇదే అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి సిద్ధార్థ్ సింగ్ బుధవారం మాట్లాడారు. కాశ్మీర్‌పై జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చలు జరగనున్నాయన్నారు.
ఈ చర్చల్లో మూడో వ్యక్తి జోక్యాన్ని అంగీకరించబోమన్నారు. ఐక్యరాజ్య సమితిలో చర్చల అంశాన్ని రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ ఈ విషయాన్ని లేవనెత్తిందన్నారు. అయితే యునైటెడ్ నేషన్స్, ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌కు సంబంధించినంత వరకు అది రెండు దేశాల ద్వైపాక్షిక చర్చల అంశమని అందరికీ తెలుసన్నారు. ఈ విషయంలో మూడోవ్యక్తికి ఏమాత్రం చోటు లేదని సింగ్ తేల్చిచెప్పారు.
పాకిస్తాన్లో బాలీవుడ్ సినిమా పాంటమ్ బ్యాన్
బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, కత్రినా కైఫ్‌లు నటించిన ఫాంటమ్ సినిమా విడుదలపై పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధించింది. 26/11 ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడు హఫీజ్ సయీద్ అభ్యర్థన మేరకు పాకిస్తాన్ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో వస్తోంది.












Click it and Unblock the Notifications