అప్పు కోసం ఆపసోపాలు: వరల్డ్ బ్యాంక్ చీఫ్ కాళ్ల దగ్గర పాక్ పరువు!
కటిక దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్.. అప్పు పుట్టడం కోసం ఏ స్థాయికైనా దిగజారుతోంది. తాజాగా భారత సంతతికి చెందిన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా పాకిస్థాన్‌లో 4 రోజుల పర్యటనకు రాగా.. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆయనకు అసాధారణ రీతిలో ఘనస్వాగతం పలికింది. దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు రుణాలు కావాల్సి రావడంతో ఈ పర్యటనను పాక్ ప్రభుత్వం ఓ భారీ సాంస్కృతి వేడుకలా మార్చేసింది.
'ఈ మట్టి కొడుకు' అంటూ సెంటిమెంట్ పాలిటిక్స్
అజయ్ బంగా పూర్వీకులు 1947 విభజనకు ముందు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఖుషాబ్ జిల్లాలో ఉండేవారు. అప్పుల కోసం పాక్ ప్రభుత్వం ఆయన పర్యటనలో ఈ 'సెంటిమెంట్' కార్డును వాడింది. బంగా తన పూర్వీకుల ఇంటిని సందర్శించినప్పుడు స్థానిక అధికారులు ఆయనను 'మిట్టి కా బేటా' (ఈ మట్టి కొడుకు) అని సంబోధిస్తూ ఘనంగా ఆహ్వానించారు. ఆయన కుటుంబ ఆస్తులకు సంబంధించిన దశాబ్దాల నాటి అసలు రెవెన్యూ రికార్డులను అధికారులు ఆయనకు బహుమతిగా అందజేశారు. ఆయనను ప్రసన్నం చేసుకోవడం కోసం గోడలకు రంగులు వేయించి.. పంజాబీతో పాటు హిందీ భాషలో కూడా స్వాగత నినాదాలు రాయించడం విశేషం.

అప్పుల కుప్పలో పాక్!
పాకిస్థాన్ ప్రస్తుతం సుమారు 130 బిలియన్ డాలర్ల విదేశీ అప్పుల్లో ఉంది. ఇందులో దాదాపు 20 శాతం వాటా ప్రపంచ బ్యాంకుదే. 2025 చివరలో పబ్లిక్ సర్వీసుల కోసం వరల్డ్ బ్యాంక్ 700 మిలియన్ డాలర్ల అప్పును విడుదల చేసింది. ఇప్పుడు పాక్ చూపు తదుపరి భారీ రుణాలపై ఉంది. అందుకే అప్పు ఇచ్చే వారిని ప్రసన్నం చేసుకోవడానికి షెహబాజ్ ప్రభుత్వం ఎంతటి 'తమాషా' చేయడానికైనా సిద్ధపడింది.
20 బిలియన్ డాలర్ల కోసం పాకులాట
తన పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీప్, ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబుతో కీలక భేటీలు నిర్వహించారు. రాబోయే పదేళ్లలో పాకిస్థాన్ సుమారు 20 బిలియన్ డాలర్ల వరకు రుణం పొందేలా 'కంట్రీ పార్టనర్‌షిప్ ఫ్రేమ్‌వర్క్'పై చర్చలు జరిగాయి. అయితే ఈ రుణం అందాలంటే పాకిస్థాన్ తన పాలనలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు షరతు విధించింది. ఓ వైపు అప్పుల కోసం వివిధ దేశాల ముందు తలవంచుకుని నిలబడాల్సి వస్తోందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ వాపోతుంటే.. మరోవైపు అప్పు ఇచ్చే సంస్థల అధిపతుల పర్యటనలను వినోద ప్రదర్శనలుగా మార్చడం పాక్ దౌత్య వైఫల్యానికి అద్దం పడుతోంది. వారసత్వాన్ని గౌరవించడం కంటే, దేశ ఉనికిని కాపాడుకోవడానికి పాక్ చేస్తున్న 'అప్పుల డ్రామా'గా ఇది కనిపిస్తోందని విమర్శకులు పేర్కొంటున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications