Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వామ్మో.. పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ఇన్ని వందలా..? భారత్ తో పోల్చితే..?

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఆ దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్కడి ప్రజలు ఏం కొనలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచేసింది. దీంతో అక్కడి ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.

పాకిస్థాన్ లో అధిక ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల ధరలతోపాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. తాజాగా లీటరు పెట్రోల్ ధరపై రూ. 10.39 పెంచేసింది. దీంతో ప్రస్తుతం ఆ దేశంలో లీటరు పెట్రోల్ ధర రూ. 266.79 గా ఉంది. జూన్ 16, 2025 న లీటరు పెట్రోల్ పై రూ. 4.80 పెంచగా.. తాజాగా మరో రూ. 10 పెంచేసింది. దీంతో అక్కడి ప్రజలు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. పెట్రోల్ తో పాటు డీజిల్ కూడా లీటరు రూ. 10.39 పెంచేసింది. దీంతో లీటరు డీజిల్ ధర రూ. 272.98 కు చేరింది. పెంచిన ధరలు జులై 1 నుండి అమల్లోకి రానున్నట్లు అక్కడి ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Pakistan Grapples with Soaring Inflation as Petrol Diesel Hit Rs 272 98 per Liter

మరోవైపు భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ చైనా మరోసారి పాకిస్థాన్ కు భారీగా సాయం చేసింది. పాకిస్థాన్ కు 3.4 బిలియన్ డాలర్లు ఆర్థిక సాయం చేయాలని చైనా తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్థాన్ విదేశీ మారకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. చైనా ఇవ్వనున్న 3.4 బిలియన్ డాలర్లను కలిపితే పాకిస్థాన్ విదేశీ మారకాల నిల్వ 14 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF) లక్ష్యాలను చేరుకోవాలంటే పాకిస్థాన్ ఇలా అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ పై భారత్ కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలో అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో వివిధ దేశాలు, ప్రపంచ సంస్థల నుంచి భారీగా రుణాన్ని సమీకరిస్తోంది పాకిస్థాన్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+