భార్యను కాల్చి చంపి, ఆత్మహత్య చేసుకున్న పాక్ మంత్రి

కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్రంలో సీనియర్ మంత్రి మీర్ హజర్ ఖాన్ బిజ్‌రానీ (71) తుపాకితో భార్యను కాల్చి చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన దేశంలో తీవ్ర సంచలనం సృష్టించింది.

ఇద్దరి మృతదేహాలను పడకగదిలో రక్తంమడుగులో పడి ఉండగా గుర్తించారు. మీర్ భార్య ఫరీహ రజాక్ కూడా గతంలో పాకిస్తాన్ చట్టసభకు ప్రాతినిధ్యం వహించారు. బిజ్‌రానీ మూడు మార్లు భార్యపైకి కాల్పులు జరిపారు.

Pakistan Minister Shoots Wife Thrice Before Killing Self: Police

కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మంత్రి తలపై బుల్లెట్ గాయం ఉంది. బిజరానీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) ప్రముఖ నాయకుడు. సింధ్ ప్రోవిన్స్ ప్రణాళిక, అభివృద్ధి మంత్రిగా పనిచేస్తునన్నారు. ఆయన భార్య జర్నలిస్టుగా కూడా పనిచేశారు.

శుక్రవారం ప్రార్థనల అనంతరం ఇరువురి అంత్యక్రియలు జరిగాయి. రజాక్ అంత్యక్రియులు కరాచీలోని డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ ఏరియాలో జరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+