పాకిస్థాన్ సైన్యం మాస్టర్ ప్లాన్.. అమెరికా అండతో.. భారత్ కు బిగ్ అలర్ట్..!
భారత్ సరిహద్దు దేశాలైన పాకిస్థాన్- చైనాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు ఒకర్నొకరు ఐరన్ బ్రదర్స్ గా అభివర్ణించుకుంటూ ఉంటాయి. పాకిస్థాన్- చైనా ల మధ్య దౌత్య పరమైన సంబధాలతోపాటు వ్యూహాత్మక, సైనిక, ఆర్థిక సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఇక చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైనా- పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా పాకిస్థాన్ లోని కీలకమైన గ్వదర్ పోర్టు నుంచి చైనాలోని జెన్ జియాంగ్ పోర్టు వరకు రైలు, రోడ్డు మార్గాలు, మౌలిక సదుపాయాల కల్పన అలాగే ఇంధన ప్రాజెక్ట్ లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇరు దేశాలు భారత్ ను అన్ని విధాలుగా దెబ్బ తీయాలని చూస్తున్న సంగతి కూడా తెలిసిందే.
అయితే గత కొంత కాలంగా పాకిస్థాన్ కొన్ని విషయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మెల్లగా చైనాను పక్కన పెట్టి అమెరికాకు క్లోజ్ అవుతూ వస్తోంది. పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ గా అసిమ్ మనీర్ పగ్గాలు చేపట్టినప్పటినుంచి పాకిస్థాన్ సైన్యం చైనాను కాదని అమెరికాకు దగ్గరవుతూ వస్తున్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. అయితే తాజాగా ఇదే విషయంపై ఆ దేశ ప్రధాన ప్రతిపక్ష నేత జమియత్ ఉలేమా ఈ ఇస్లామ్ చీఫ్ మౌలానా ఫజల్ ఉల్ రహ్మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆర్మీ.. చైనా- పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ను నీరు గార్చుతోందని అమెరికాకు దగ్గరవుతూ చైనాతో ఉన్న అన్ని రకాల సంబంధాలను దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ చర్యల కారణంగా చైనాకు మన దేశంపై నమ్మకం తగ్గుతోందని మండిపడ్డారు. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో పాకిస్థాన్ లో పెట్టుబడులు పెట్టేందుకు చైనాతో పాటు ఇతర దేశాలు కూడా వెనకడుగు వేస్తాయని స్పష్టం చేశారు.

ఈ మేరకు చైనా- పాకిస్థాన్ మధ్య దశాబ్దాల కాలంగా ఉన్న మైత్రిని అమెరికా కాలరాస్తోందని పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ నేతృత్వంలోనే ఈ షిఫ్ట్ జరుగుతోందని దుయ్యబట్టారు. పాకిస్థాన్ గతంలో చైనాకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఇప్పుడు అమెరికాకు ఇస్తూ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెప్పు పొందాలని ఆలోచన చేస్తోందని తెలిపారు. అలాగే దేశంలోని అపారమైన ఖనిజ సంపదను దేశ ప్రజల ప్రయోజనం కోసం కాకుండా విదేశీ ప్రయోజనాల కోసం పాకిస్థాన్ ఆర్మీ అధికారులు ఉపయోగిస్తున్నారని ఫజల్ ఉల్ రహ్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక పాకిస్థాన్ లోని అరుదైన ఖనిజ నిల్వలపై అమెరికా కన్ను పడిందని అందుకే ట్రంప్ కూడా పాకిస్థాన్ తో మైత్రికి ఆసక్తి చూపిస్తున్నట్లు పలు అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ అలెర్ట్ అయింది. పాకిస్థాన్ - అమెరికా సంబంధాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.












Click it and Unblock the Notifications
