ఆ విషయంలో తగ్గేదేలేదు.. భారత్ కు పాక్ వార్నింగ్..!

జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై భారత్ చేపట్టిన రూ. 5,129 కోట్ల సవాల్‌కోట్ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌పై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్.. అంతర్జాతీయ బాధ్యతలను ఉల్లంఘించి, ఇస్లామాబాద్‌ కు వ్యతిరేకంగా "నీటిని తరలించే విధానం" అమలు చేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం సింధు జలాల కమిషనర్‌ లకు ఈ విషయమై సంప్రదింపులు కోరింది.

1960 సింధు జలాల ఒప్పందం (IWT) నిలిపివేత తర్వాత భారత్ ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించింది. దీనిని ఒప్పంద ఉల్లంఘనగా పాకిస్తాన్ భావించి పోరాడతామని ప్రతిజ్ఞ చేయగా, భారత్ మాత్రం ఇది తన అభివృద్ధి హక్కుల పరిధిలోనే చేస్తుందని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తాజా ప్రకటనలో, భారతదేశంలో చేపట్టే ఏ అభివృద్ధి ప్రాజెక్ట్‌ అయినా "స్థానిక అవగాహన" ఆధారంగానే ఉంటుందని తెలిపింది. ఈ మేరకు MEA ఇలా పేర్కొంది.. "భారతదేశంలో జరిగే ఏ అభివృద్ధి ప్రాజెక్టు అయినా మా అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ ను కూడా మేము అదే విధంగా చూస్తున్నాం"

ఫిబ్రవరి 8న సవాల్‌ కోట్ మెగా డ్యామ్ ప్రారంభంపై పాకిస్తాన్ అధికారులు తీవ్రంగా స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. తమకు అవసరమైన నీటి వనరులను హరించే "విస్తృత నీటిని తగ్గించే వ్యూహంలో" ఇది భాగమని వారు ఆరోపించారు. పాకిస్తాన్ విదేశాంగ ప్రతినిధి తాహిర్ అంద్రాబి, సవాల్‌కోట్ ప్రాజెక్ట్‌పై భారత్ నుండి సంప్రదింపులు, సమాచారం కోరినట్లు ధృవీకరించారు. పాకిస్తాన్ సింధు జలాల కమిషనర్ జూలైలో, అలాగే ఫిబ్రవరి 11న భారత కౌంటర్‌పార్ట్‌కు IWT నిర్దేశించిన సమాచారం కోసం లేఖలు పంపారు.

సింధు జలాల ఒప్పందం "కట్టుబడి ఉండాల్సిన అంతర్జాతీయ ఒప్పందం" అని అంద్రాబి నొక్కిచెప్పారు.. "జూన్, ఆగస్టు 2025లో మధ్యవర్తిత్వ కోర్టు నిర్ణయాలకు అనుగుణంగా సింధు జలాల ఒప్పందం అమల్లో ఉంది. ఏకపక్ష చర్యలు లేదా ధిక్కరణ ఈ చట్టపరమైన వాస్తవికతను మార్చలేవు." భారత్ చర్యలను అంతర్జాతీయ వేదికలు, న్యాయ యంత్రాంగాల ద్వారా సవాల్ చేస్తామని అంద్రాబి ప్రతిజ్ఞ చేశారు. తమ ప్రజల "జీవనాధారమైన నీటి హక్కుల" రక్షణకు ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో పాటించాలని భారత్‌కు పిలుపునిచ్చారు. చీనాబ్ వంటి పశ్చిమ నదుల నుండి తమ దేశంలోని మూడు వంతుల నీరు వస్తుందని వివరించారు.

అంద్రాబి ఇలా అన్నారు.. "సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్ పూర్తి బాధ్యతలను నెరవేర్చి, కట్టుబడి ఉండాలి. వివాదాల శాంతియుత పరిష్కారానికి, అంతర్జాతీయ చట్టపరమైన యంత్రాంగాల ద్వారా భారతదేశంతో సమస్యలను పరిష్కరించుకోవడానికి పాకిస్తాన్ పూర్తిగా కట్టుబడి ఉంది. మా ప్రజల జీవనాధారమైన నీటి హక్కులపై ఎప్పటికీ రాజీపడబోము"

Pakistan Objects to India s 5 129 Cr Sawalkot Dam on Chenab Calls it Dewatering Policy Violation

పాకిస్తాన్ పూర్తిస్థాయిలో ఒప్పందాన్ని పాటించాలని కోరగా, భారత్ తన మౌలిక సదుపాయాలను నిర్వహించుకునే సార్వభౌమ హక్కును నొక్కిచెప్పింది. IWT ని కేంద్రం నిలిపివేసిన కాలంలో ఈ ప్రాజెక్టును చేపట్టడం దేశ అంతర్గత అభివృద్ధికి సంబంధించినదని పేర్కొంది. NHPC లిమిటెడ్ రూ. 5,129 కోట్ల అంచనా వ్యయంతో సవాల్‌కోట్ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్, రాంబన్ జిల్లాల్లో చీనాబ్ నదిపై, బాగ్లిహార్, సలాల్ ప్రాజెక్ట్‌ల మధ్య ఇది నెలకొంది.

ఈ ప్రాజెక్ట్ మొత్తం 1,856 MW సామర్థ్యాన్ని (మొదటి దశ: 1,406 MW, రెండవ దశ: 450 MW) కలిగి ఉంది. "నది ప్రవాహ ఆధారిత" ప్రాజెక్ట్‌గా వర్గీకరించబడింది. దీన్ని పూర్తి చేయడానికి తొమ్మిదేళ్లు పట్టొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం త్వరగా దీనిని ప్రారంభించేందుకు కృషి చేస్తోంది.

సింధు జలాల ఒప్పందం రద్దు తర్వాత కేంద్రం ఆమోదించిన మొదటి ప్రధాన ప్రాజెక్ట్ ఇదే కావడంతో దీనికి వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది. పకల్ డల్, కిరు, రత్లే డ్యామ్‌లతో సహా చీనాబ్ నది వ్యవస్థపై బహుళ జలవిద్యుత్ ప్రాజెక్టులను వేగవంతం చేసే మోదీ ప్రభుత్వ ప్రణాళికలో సవాల్‌ కోట్ భాగం. ఇది విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, నీటి ప్రవాహాల నిర్వహణను మెరుగుపరుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+