టిప్పుసుల్తాన్.. మా హీరో, ఆయనే మాకు స్ఫూర్తి: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: పాకిస్తాన్ చెరలో చిక్కిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను స్వదేశానికి అప్పగిస్తామంటూ ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గురువారం ప్రకటించారు. పాకిస్తాన్ ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తన ప్రసంగంలో చాలా విషయాలను ఆయన స్పృశించారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీషర్లను ఎదరించిన టిప్పు సుల్తాన్ గురించి ఆయన ప్రస్తావించారు. టిప్పుసుల్తాన్ తో పాటు ఢిల్లీని పరిపాలించిన మొఘల్ రాజు మహమ్మద్ బహదూర్ షా జాఫర్ పేరును కూడా ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. టిప్పు సుల్తాన్ తమ హీరో అంటూ ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పరమత సహనం కోసం కృషి చేసిన టిప్పు సుల్తాన్ ను స్ఫూర్తిగా తీసుకుంటామని చెప్పారు.

ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగంలో పరోక్షంగా ఉగ్రవాదం గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. తాము ఎవ్వరికీ బానిసలం కాదని అన్నారు. స్వేచ్ఛను కోరుకునే టిప్పు సుల్తాన్ ఆదర్శాలను పుణికి పుచ్చుకున్నామని చెప్పారు. స్వాతంత్ర్యం కావాలా? లేక బానిసత్వం కావాలా? అనే రెండు మార్గాలను ముందుంచగా.. బహదూర్ షా జాఫర్ బానిసత్వాన్ని కోరుకున్నారని, టిప్పు సుల్తాన్ మాత్రం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఎంచుకున్నారని అన్నారు. తాము కూడా టిప్పు సుల్తాన్ చూపిన మార్గాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. టిప్పు సుల్తాన్.. పాకిస్తాన్ హీరో అని అన్నారు.

Pakistan PM Imran Khan praised Tipu Sultan

భారత్ లో టిప్పుసుల్తాన్ గురించి తెలియని వారుండరు. 1750 నవంబర్ 20వ తేదీన కర్ణాటకలోని దేవనహళ్లిలో ఆయన జన్మించారు. కర్ణాటకలోని శ్రీరంగ పట్టణం రాజధానిగా ఆయన తన పరిపాలన సాగించారు. కర్ణాటక ప్రభుత్వం ఏటా టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుంది. దీనిపై వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ.. పట్టించుకోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+