ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం: పాకిస్థాన్ ప్రధాని సంచలన హెచ్చరిక
పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ పై ఆపరేషన్ సిందూర్ ప్రయోగించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీసింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. భారత్ దెబ్బకు పాకిస్థాన్ అల్లకల్లోలం అయింది. దాదాపు 200 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బుధవారం రాత్రి సంచలన ప్రకటన చేశారు. పాకిస్థాన్ లో జాతినుద్దేశించి ప్రసంగించారు. 'ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం అన్నారు. భారత్ కు ఎలా బదులు ఇవ్వాలో పాకిస్థాన్ కు తెలుసు. ఈ దాడిలో మృతి చెందిన సాయుధ బలగాలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తోంది' అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు.

భారత్ కు ఎప్పుడు, ఎక్కడ, ఎలా బదులు ఇవ్వాలో పాకిస్థాన్ కు బాగా తెలుసని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. భారత దాడుల్లో చనిపోయిన దళాలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తుందని తెలిపారు. పాక్ ప్రధాని చేసిన ప్రసంగం అనంతరం ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరగనున్నాయో అని ఆందోళనలు నెలకొన్నాయి.
ఇక ఈ ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబసభ్యులు హతం అయ్యారు. ఆయన కుటుంబంలోని 10 మంది, మరో నలుగురు అనుచరులు మరణించినట్లు మసూద్ అజహర్ వెల్లడించాడు. 56 ఏళ్ల మసూద్ అజహర్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పేర్కొంది.
Pakistan PM Shahbaz Sharif says, "... We will avenge these martyrs for every drop of their blood spilled... Pakistan knows how to give a befitting reply. The entire nation salutes its brave armed forces..."
— ANI (@ANI) May 7, 2025
(Pic source: file pic) pic.twitter.com/xb20qtGt40
ఇక పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకునే ప్రమాదం ఉందని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ థిల్లాన్ పేర్కొన్నారు. మనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందని థిల్లాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే వాళ్ల దాడి భారత పౌరులకు ప్రమాదకరం కాకపోవచ్చని.. పాకిస్థాన్ మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications