భారత్ దెబ్బకు పాక్ మంత్రి ప్యాంట్ జారింది!!: మోడీకి ఎలా కౌంటరివ్వాలో చెప్తా: ఇమ్రాన్ ఖాన్
న్యూఢిల్లీ: యూరీ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. తాము న్యూక్లియర్ దాడికి కూడా సిద్ధమని వ్యాఖ్యానించిన పాకిస్తాన్ రక్షణ మంత్రి క్వాజా మహ్మద్ ప్యాంట్ ఊడిపోయిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సర్జికల్ స్ట్రయిక్ ద్వారా భారత్.. పాక్‌కు గట్టి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇండియన్ ఆర్మీ పీవోకేలో మెరుపు దాడులు నిర్వహించి 38 మంది ముష్కరులను హతమార్చారని తెలియగానే.. పాక్ రక్షణ మంత్రి ప్యాంటు ఊడిపోయిందని పేర్కొంటో ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇది నెట్లో బాగా చక్కర్లు కొడుతోంది. నిజానికి ఇది పాత వీడియో.
ఓ సందర్భంగా అతిథులను ఆహ్వానిస్తున్న సదరు మంత్రి ప్యాంటు ఊడింది. దీంతో ఆయన అవమానంగా ఫీలయ్యారు. ఒంటిమీద ప్యాంటు కాపాడుకోలేని మంత్రి అణ్వస్త్రాలు వేస్తామని భారత్‌ను బెదిరించడం విడ్డూరమని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. పాక్ మీడియాలో కూడా ఈ వీడియో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

భారత్‌కు ఆ హక్కు ఉంది: బంగ్లాదేశ్
తన భూభాగంపై దాడులు చేసిన వారికి బుద్ధి చెప్పే హక్కు భారత్‌కు ఉందని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో పీవోకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ లక్షిత దాడులు చేయడంపై బంగ్లాదేశ్ స్పందించింది. భారత్ చర్య చట్టపరంగా, అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సలహాదారు ఇక్బాల్ చౌదరి అన్నారు.
దేశ సార్వభౌత్వంపై, తన భూభాగంలో దాడుల పట్ల గట్టిగా స్పందించడం ఆ దేశాల హక్కుగా బంగ్లాదేశ్ నమ్ముతోందన్నారు. ప్రతి దేశం ఇతర దేశం సార్వభౌమత్వాన్ని గౌరవించాలని సూచించారు. అలాగే కాశ్మీర్ అంశంపై మాట్లాడుతూ.. ఇది ద్వైపాక్షిక వివాదమని, ఆవలి వైపు నుంచి నిబంధనల ఉల్లంఘన జరుగుతోందన్నారు. ఉగ్రవాద చర్యలను బంగ్లాదేశ్ సహించబోదన్నారు.
మోడీకి ఏ విధంగా జవాబివ్వాలో షరీఫ్‌కు చెప్తా: ఇమ్రాన్ ఖాన్
పీవోకేలోకి వచ్చి సర్జికల్ స్ట్రయిట్ నిర్వహించిన భారత్ పైన పాక్ రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్ ప్రధాని మోడీకి ఎలా కౌంటర్ ఇవ్వాలో తమ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెబుతానన్నారు. రేపు (శుక్రవారం) లాహోర్‌లో ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications