భారత్‌తో యుద్ధానికి ముందే పాకిస్తాన్ విలవిల.. ఏం జరుగుతోంది?
ప్రస్తుతం పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విపరీతమైన ద్రవ్యోల్బణం, ఆకాశాన్నంటుతున్న ఆహార ధరలతో కోట్లాది మంది ప్రజలు బతుకు భారమై నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. చికెన్ ధర కిలోకు ఏకంగా రూ. 800 కి చేరింది. బియ్యం దాదాపు కిలోకు రూ. 340కి, గుడ్లు డజన్ రూ. 332కి, పాలు లీటరు రూ. 224కి పెరిగాయి. ఈ ధరల పెరుగుదల సామాన్యుల నడ్డి విరిస్తోంది. ఆకలి చావులతో అలమటించే పరిస్థితితో కోట్లుమిట్టాడుతుంది.
ఆకలితో అలమటిస్తున్న పాక్ ప్రజలు
ఆహార భద్రత లేక కోటి మందికి పైగా పాకిస్తానీయులు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. పాకిస్తాన్ ఆర్థిక భవిష్యత్తు చాలా నిరాశాజనకంగా కనిపిస్తోంది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వరి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల ఉత్పత్తిచాలా వరకు తగ్గిపోతుంది. ఇది ఆహార కొరతను మరింత తీవ్రతరం చేసి, ఇప్పటికే దారుణంగా ఉన్న ఆహార భద్రత లేమితో అల్లాడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోటికి పైగా పాకిస్తానీయులు ఆకలి ప్రమాదంలో ఉన్నారని, వ్యవసాయంపై ఆధారపడిన గ్రామీణ ప్రాంతాలు అత్యంత దారుణంగా ప్రభావితమవుతాయని ఈ నివేదిక పేర్కొంది.

ఆర్థిక సంక్షోభం నిత్యావసర సేవలను కూడా దెబ్బతీసింది. సగటు ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయికి చేరింది. బ్రెడ్, బంగాళాదుంపలు, టమాటాలు, పండ్లు వంటి ప్రాథమిక ఆహార వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో చాలా కుటుంబాలు కనీసం రెండు పూటలా భోజనం కూడా భరించలేని అస్థిరమైన పరిస్థితిలోకి నెట్టబడ్డాయి.
భారత్ - పాక్ మధ్య ఉద్రక్తతలు..
ఇలాంటి దారుణమైన ఆర్థిక పరిస్థితిలో పాకిస్తాన్ సతమతమవుతుండగా, పొరుగు దేశం భారత్‌తో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఇరు దేశాల సంబంధాలు మరింత క్షీణించాయి. 2025 ఏప్రిల్ 22న జరిగిన ఈ దాడిలో 25 మందికి పైగా అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.
ఈ దాడిపై భారత ప్రధాని నరేంద్ర మోడీ గట్టిగా స్పందించారు. దాడికి బాధ్యులైన వారిని, వారి వెనుక ఉన్న వారిని భారత్ తీవ్రంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు. ఈ దౌత్యపరమైన ఉద్రిక్తత కూడా పాకిస్తాన్ ఆర్థిక కష్టాలను మరింత పెంచింది. ఒకవైపు అంతర్గత ఆర్థిక సంక్షోభం, మరోవైపు బాహ్య ఒత్తిళ్లతో పాకిస్తాన్ నాయకత్వం సతమతమవుతోంది. అటు సింధు నదీ జలాల ఒప్పందాన్ని పాక్‌తో ఉన్న ఒప్పందాన్ని భారత్ పూర్తిగా రద్దుచేసింది. దీంతో తాగు, సాగునీటి కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే ఆకలి చావులతో ఉన్న పాక్‌ను మరింత సంక్షోభంలోకి నెడుతోంది.
వాణిజ్యం బంద్
అటు పాకిస్తాన్‌తో ఉన్న వాణిజ్య సంబంధాలను భారత్ రద్దు రేసింది. దీంతో పాక్ దిగుమతి చేసుకునే ఫార్మా, చక్కెర, ఇతర ఫుడ్ సంబంధింత వస్తువులు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాక్‌కు రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య ఆంక్షల వల్ల మరింత దిగజారే పరిస్థితి నెలకొంది. ద్రవ్యోల్బణం 25 శాతానికి చేరింది. దీంతో పాకిస్తాన్ ప్రస్తుతం ఆసియాలోనే అత్యంత ఖరీదైన దేశంగా నిలిచింది. ఇది ఎంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోందో చెప్పకనే చెబుతోంది.
తీవ్రమైన ద్రవ్యోల్బణం, ఆహార భద్రత లేమి, ఆర్థిక పతనంతో పాకిస్తాన్ సతమతమవుతున్న తరుణంలో, భారత్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల ప్రభావం ఈ సంక్షోభాన్ని మరింత లోతుకు నెడుతున్నాయి. పాకిస్తాన్ ముందున్న సవాళ్లు చాలా పెద్దవి. మరింత అస్థిరతను నివారించాలంటే, పాకిస్తాన్ నాయకత్వం అంతర్గత ఆర్థిక సమస్యలను, బాహ్య సంబంధాల ఉద్రిక్తతలను రెండింటినీ ఏకకాలంలో పరిష్కరించుకోవాలి. ప్రస్తుతం జీవన వ్యయం పెరుగుతుండటంతో, విస్తృతమైన ఆకలి ప్రమాదం ముంచుకొస్తోంది. కోట్లాది మంది పాకిస్తానీయులకు పరిస్థితి అత్యంత క్లిష్టంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో భారత్‌తో సైనిక ఘర్షణను ఎదుర్కొనే ఆర్థిక స్తోమత పాకిస్తాన్‌కు ఉందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.












Click it and Unblock the Notifications