ఐఎస్ఐ చీఫ్ కు చెక్ పెడుతున్న పాకిస్థాన్

ఇస్లామాబాద్: అత్యంత శక్తివంతమైన ఇంటర్ సర్వీస్ ఇంటిలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ ను మార్చాలని పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుందని తెలిసింది. ఐఎస్ఐ చీఫ్ జనరల్ రిజ్వాన్ అక్తర్ ను మార్చి ఆస్థానంలో కరాచీ పోలీస్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముక్తర్ ను నియమిస్తారని పాక్ వర్గాలు తెలిపాయి.

లెఫ్టినెంట్ జనరల్ జహీర్ ఉల్ ఇస్లాం స్థానంలో 2014 సెప్టెంబర్ లో రిజ్వాన్ అక్తర్ ఐఎస్ఐ చీఫ్ గా భాద్యతలు స్వీకరించారు. ఐఎస్ఐ చీఫ్ పదవి కాలం మూడేళ్లు ఉంటుంది. అయితే మూడేళ్లు పూర్తి కాకుండానే రిజ్వాన్ అక్తర్ ను ఆ స్థానం నుంచి తప్పించాలని పాక్ నిర్ణయించింది.

Pakistan’s ISI chief Rizwan Akhtar likely to replaced

పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ రిటైర్మెంట్ ప్రకటించే సమయంలో, లేదా ఆయన పదవి కాలం పోడిగించే సమయంలో రిజ్వాన్ అక్తర్ ను మార్చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించిందని ఓ అధికారి స్థానిక మీడియాకు చెప్పారు.

పాక్ కు ఈగో, ఆర్మీకి అహంకారం: అందుకే అలా !

అంతకు ముందు పాక్ ఆర్మీలో ఎలాంటి మార్పులు చెయ్యరాదని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ లో తాను పదవి విరమణ చేస్తానని, ఆర్మీ చీఫ్ గా కొనసాగే ఆసక్తి లేదని రహీల్ షరీఫ్ గత జనవరిలోనే చెప్పారు.

అయితే ప్రస్తుతం భారత్-పాక్ దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న సమయంలో రహీల్ షరీఫ్ పదవి కాలం పొడగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఐఎస్ఐ చీఫ్ రిజ్వాన్ అక్తర్ ను ఎందుకు మార్చుతున్నారో అనే విషయం పాక్ వెల్లడించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+