భారత్‌తో కాశ్మీర్ అంశం కూడా మాట్లాడుతాం: పాకిస్తాన్
ఇస్లామాబాద్: కాశ్మీర్ సహా పలు ఆంశాల పైన భారత దేశంతో తాము చర్చిస్తామని పాకిస్తాన్ గురువారం ప్రకటించింది. భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఎస్ జయశంకర్ మార్చి 3వ తేదీ నుండి రెండు రోజుల పాటు పాకిస్తాన్‌లో పర్యటించనున్నారు.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఐజాజ్ అహ్మద్ చౌదరితో అన్ని అంశాలపై మాట్లాడతారు. మార్చి 3న పాక్ వస్తున్న ఎస్ జయశంకర్‌తో తాము అన్ని విషయాలు మాట్లాడుతామని పాక్ తెలిపింది. జమ్మూ కాశ్మీర్ అంశం సహా ప్రతి అంశం పైన చర్చిస్తామని తెలిపారు.
పాకిస్తాన్ విదేశీ అధికార ప్రతినిధి తన్సీమ్ అస్లామ్ గురువారం మాట్లాడారు. భారత్‌తో ఏం చర్చించాలనే విషయమై పైనలైజ్ అయిందని తెలిపారు. అందులో ఇరు దేశాల ప్రజల మధ్య వ్యాపార అంశాలు కూడా ఉన్నాయని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఫోన్ చేశారు.












Click it and Unblock the Notifications