Pakistan: బెడిసి కొట్టిన పాక్ ప్లాన్- ట్రంప్ కు సాయం చేయబోతే స్వదేశంలో షాక్..!
పశ్చిమాసియాలో తమ మిత్రదేశం ఇజ్రాయెల్ ను హమాస్ దాడుల బారి నుంచి కాపాడేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన గాజా శాంతి బోర్డులో 35 దేశాలకు చేరాలని ఆహ్వానం అందింది. ఇందులో భారత్, రష్యా, చైనాలకు సైతం ఆహ్వానాలు అందినా ఇప్పటివరకూ సైలెంట్ గా ఉన్నాయి. కానీ ట్రంప్ పై విశ్వాసం చాటుకునేందుకు ఈ బోర్డులో చేరేందుకు అంగీకరించిన పాకిస్తాన్ (pakistan) ప్రభుత్వానికి ఇప్పుడు స్వదేశంలో షాకులు తప్పడం లేదు.
గాజాలో శాశ్వత శాంతి కోసమంటూ ట్రంప్ రూపొందించిన శాంతి బోర్డు తాజాగా దావోస్ లో సమావేశమైంది. ఇందులో ట్రంప్ కు పక్కనే కూర్చున్న పాకిస్తాన్ ప్రధాని దీనికి తమ బేషరతు మద్దతు ప్రకటించారు. దీంతో పాకిస్తాన్ లో జనం ఆయనపై భగ్గుమంటున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు, సాధారణ ప్రజలు సైతం షెహబాజ్ షరీఫ్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. దేశంలోని రాజకీయ, మత, సైద్ధాంతిక లోపాలను ఈ నిర్ణయం బహిర్గతం చేసింది. గాజా బోర్డులో పాకిస్తాన్ చేరాలన్న షెహబాజ్ షరీఫ్ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు, ఇస్లామిక్ గ్రూపులు, మత పండితులు మండిపడుతున్నారు.

అలాగే ఈ చర్య వెనుక ఉన్న ఉద్దేశ్యం, ప్రక్రియ రెండింటినీ ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రధానితో పాటు ప్రభుత్వం కూడా ఇరుకునపడింది. అయితే ట్రంప్ ను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్న షెహబాజ్, ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ మాత్రం ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గే పరిస్దితుల్లో కనిపించడం లేదు. స్వదేశంలో పార్లమెంటరీ చర్చ, ప్రజా సంప్రదింపులు లేదా భాగస్వాముల అభిప్రాయాలు లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడంపై జనాగ్రహం వ్యక్తమవుతోంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ నాయకులు దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, సమగ్రంగా సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
-
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications