Pakistan Train Hizack: ప్రతి బుల్లెట్‌కు 10 మంది బందీలను చంపేస్తాం.. పాకిస్థాన్‌కు హెచ్చరిక
Pakistan Train Hizack: పాకిస్థాన్ రైలు హైజాక్ ఘటనతో భయాందోళనలు నెలకొన్నాయి. బలూచిస్థాన్‌లో రైలు హైజాక్ అయ్యి 20 గంటలకు పైగా అయ్యింది. ఈ రైలు హైజాక్ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ లోని షాబాజ్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) తన ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటివరకు బలూచ్ ల డిమాండ్లు నెరవేరలేదు. షాబాజ్ ప్రభుత్వానికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) 48 గంటల అల్టిమేటం ఇచ్చింది. బలూచ్ తిరుగుబాటుదారులు నూతన ప్రకటన విడుదల చేసి పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యాన్ని హెచ్చరించారు. తమ డిమాండ్లను తీవ్రంగా పరిగణించకపోతే ప్రతి బుల్లెట్ కు 10 మంది బందీలను చంపుతామని వారు బెదిరించారు. బలూచ్ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని బలూచ్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్ చేసింది. 48 గంటల్లో డిమాండ్ ను నెరవేర్చకపోతే బందీలను చంపుతామని డిమాండ్ చేసింది.
తిరుగుబాటుదారుల హెచ్చరిక
బలూచ్ తిరుగుబాటుదారులు ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్థాన్ సైన్యం మరోసారి స్వాతంత్ర్య సమరయోధులపై బాధ్యతారహితంగా దాడి చేసిందని బలూచ్ తిరుగుబాటుదారులు ఆరోపించారు. పాకిస్థాన్ సైన్యం చేసిన దాడిలో ఏ తిరుగుబాటుదారుడూ మరణించలేదని.. అందరు యోధులు సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. పాకిస్థాన్ సైన్యం తమ హెచ్చరికను విస్మరిస్తే బాంబు దాడికి ప్రతీకారంగా మరో 10 మంది బందీలను చంపుతామని తిరుగుబాటుదారులు హెచ్చరించారు. పాకిస్థాన్ సైన్యం ఇంకో బుల్లెట్ పేల్చితే 10 మంది బందీ సైనిక సిబ్బంది చనిపోతారని హెచ్చరికలు జారీ చేశారు. జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలుపై మా నియంత్రణ బలంగా ఉందని తిరుగుబాటుదారులు పేర్కొన్నారు.

కష్టపడుతున్న పాక్ సైన్యం
పాకిస్థాన్ లోని బలూచ్ వేర్పాటువాద తిరుగుబాటుదారులు మంగళవారం బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఒక రైలుపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. రైలు 200 మందికి పైగా బందీలు ఉన్నారు. వారిని రక్షించేందుకు పాకిస్థాన్ సైన్యం, భద్రతా దళాలు చాలా కష్టపడుతున్నాయి. ఈ రైలు బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్ కు వెళుతోంది. క్వెట్టా నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీబీ పట్టణానికి సమీపంలో ఉన్న పర్వత ప్రాంతంలో బలూచ్ తిరుగుబాటుదారులు రైలుపై దాడి చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న అనేక సొరంగాలలో ఒకదాని గుండా రైలు ప్రయాణిస్తుండగా.. బలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం కోరుకునే బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి బాధ్యత వహించి, బందీలను తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు ప్రకటించింది.
ఇంతకీ ఏం జరిగింది?
మంగళవారం మధ్యాహ్నం క్వెట్టా నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరుస సొరంగాల గుండా వెళ్తుండగా జాఫర్ ఎక్స్ ప్రెస్ పై దాడి జరిగిందని పాకిస్థాన్ అధికారులు తెలిపారు. 9 బోగీల రైలులో 400 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బందీలను సురక్షితంగా విడిపించేందుకు సైనిక చర్యలు కొనసాగుతున్నాయని పాకిస్థాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 104 మంది బందీలను రక్షించినట్లు అధికారులు చెబుతున్నారు. దాడి జరిగిన ప్రదేశానికి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పనీర్ రైల్వే స్టేషన్ కు మహిళలు, పిల్లలు, వృద్ధులు సహా దాదాపు 70 మంది ప్రయాణికులు చేరుకున్నారని క్వెట్టాలోని పాకిస్థాన్ రైల్వే అధికారి ఒకరు వెల్లడించినట్లు తెలిసింది.
అంతా ప్రచారమే..
16 మంది బలూచ్ ఉగ్రవాదులను హతమార్చినట్లు పాకిస్థాన్ భద్రతా వర్గాలు ప్రకటించాయి. అయితే, బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్ భద్రతా దళాల వాదనలను ఖండించింది. దానిని పాకిస్థాన్ సైన్యం ప్రచారం చేసుకుంటోందని పేర్కొంది. బందీల విడుదల వార్తలను కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ తిరస్కరించింది. మానవతా దృక్పథంతో మహిళలు, పిల్లలు, వృద్ధులను విడుదల చేశామని పేర్కొంది. పాకిస్థాన్ సైన్యం ప్రయత్నం భగ్నం అయిందని.. పరిస్థితిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని బలూచ్ ఉగ్రవాదుల బృందం తెలిపింది.
This is probably the first incident of any #TrainHijack in the world.#Balochistan fighters have brought Pakistan to its knees.
— ASHOK_LALSOT (@ASHOKLALSOT24) March 11, 2025
The seeds of terrorism that #Pakistan had sown are now paying the price for it.#PakistanTrainHijack
👇👇
pic.twitter.com/gGdyNaLEsP












Click it and Unblock the Notifications