Viral Video: వీధుల్లో కుల్ఫీ అమ్ముతున్న ట్రంప్-అసలు కథ వేరే-ఫిదా అవుతున్న నెటిజన్లు
ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఉండటం సహజం. సామాన్యుల సంగతి పక్కనపెడితే... అచ్చు సెలబ్రిటీలను పోలి ఉండే వ్యక్తులు ఇట్టే అందరి దృష్టిని ఆకర్షిస్తారు.
ఈరోజుల్లో ఇంటర్నెట్ పుణ్యమాని అలాంటి వ్యక్తులు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. వారి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా పాకిస్తాన్‌కి చెందిన ఓ కుల్ఫీ వ్యాపారి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాడు. కారణం... అతను అచ్చు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పోలి ఉండటమే. పైగా అతని సింగింగ్ టాలెంట్ నెటిజన్లను ఫిదా చేస్తోంది.
ఆ పాకిస్తానీ సింగర్ షేర్ చేయడంతో...
ప్రముఖ పాకిస్తానీ సింగర్,గేయ రచయిత షెహజాద్ రాయ్ అతని వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 'వా... కుల్ఫీ వాలా భాయ్... అద్భుతం..' అంటూ ఆ వీడియోకి తన కామెంట్‌ని జత చేశారు. అంతేకాదు,ఎవరికైనా అతని గురించి తెలిస్తే తనకు చెప్పాలని కోరారు. షెహజాద్ ఇన్‌స్టాగ్రామ్ వాల్‌పై షేర్ చేసిన అతని వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అతను కుల్ఫీ అమ్ముతూ ఉర్ధూ పాటలు అద్భుతంగా పాడుతున్నాడు. పైగా అతను అచ్చు డొనాల్డ్ ట్రంప్‌ను పోలి ఉండటంతో... ఇంటర్నెట్‌లో అతని వీడియో ఇట్టే వైరల్‌గా మారింది.

నెటిజన్ల ఫన్నీ కామెంట్లు...
నెటిజన్లు ఈ వీడియోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అతను మాకు తెలుసని... అతని వద్ద చాలాసార్లు కుల్ఫీ తిన్నామని కొంతమంది చెబుతుంటే... బహుశా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాక... ట్రంప్ ఇలా పాకిస్తాన్ వీధుల్లో కుల్ఫీ అమ్ముకుంటున్నాడేమో... అంటూ మరికొందరు జోకులు పేల్చుతున్నారు. అతను పంజాబ్‌లోని సహివల్ ప్రాంతానికి చెందినవారని... ఆయన చిరునామా తాము చెబుతామంటూ మరికొందరు సింగర్ షెహజాద్ రాయ్ ఇన్‌స్టాలో రిప్లై ఇచ్చారు.
ట్రంప్‌ను పోలిన వ్యక్తులు చాలామందే...
ఈ పాకిస్తానీ కుల్ఫీ వ్యాపారే కాదు... గతంలోనూ ట్రంప్‌ను పోలిన పలువురు వ్యక్తులు ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించారు. అందులో స్పానిష్‌కి చెందిన డొలరస్ లెయిస్ ఆంటెలో అనే మహిళ ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆమె పొలంలో పనిచేస్తున్న ఫోటోలు,గోల్ఫ్ ఆడుతున్న ఫోటోలను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అచ్చు ట్రంప్ లాగే ఉందంటూ కామెంట్లు చేశారు. మన దగ్గర కూడా మాజీ సీఎం చంద్రబాబు నాయుడును పోలిన వ్యక్తి ఫోటోలు గతంలో ఇలాగే వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
-
మొదటి రోజే పరువు పాయే! తెల్ల బంతి కాస్తా గులాబీగా మారింది! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్..












Click it and Unblock the Notifications