వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జరిమానా కోసం పిల్లలను విక్రయానికి పెట్టాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్తానీ జిర్గా (గిరిజన న్యాయస్థానం) వేసిన జరిమానాను చెల్లించడానికి ఓ పాకిస్తానీ తన పిల్లలను విక్రయానికి పెట్టాడు. రూ. 16 లక్షలకు అతను తన నలుగురు పిల్లలను అమ్మకానికి పెట్టాడు. పాకిస్తాన్ జాకోబాబాద్ ప్రెస్ క్లబ్‌లో వారిని అమ్మకానికి పెట్టినట్లు డాన్ అనే వార్తాపత్రిక రాసింది.

గులాం రసూల్ కతోహర్ అనే వ్యక్తి మూడు నుంచి ఎనిమిదేళ్ల మధ్య వయస్సు గల తన నలుగురు పిల్లలను మంగళవారం వేలానికి పెట్టినట్లు ఆ పత్రిక రాసిది. తాము ఖోసో గిరిజన తెగకు చెందినవారమని, తమ కుమారుడు రెండేళ్ల క్రితం ఆ తెగకు చెందిన అమ్మాయితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే ఆరోపణపై జిర్గా జరిమానా వేసిందని కతోహార్ చెప్పాడు.

Pakistani man puts children 'on sale' to pay off fine

అమ్మాయి కుటుంబం తన కుమారుడిపై ఆదివారంనాడు జిర్గాకు ఫిర్యాదు చేసిందని, దీంతో జిర్గా తమ కుమారుడికి 16 లక్షల జరిమానా వేసిందని, దాన్ని అమ్మాయి కుటుంబానికి చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పాడు.

తాను మొత్తాన్ని చెల్లించే స్థితిలో లేనని, దీంతో తన ఇద్దరు కూతుళ్లనూ ఇద్దరు కుమారులను అమ్మకానికి పెట్టానని, తద్వారా తమపై జరగబోయే హింస నుంచి కాపాడుకుందామని అనుకుంటున్నామని చెప్పాడు.

English summary
In a bid to pay a fine imposed by a Pakistani Jirga (tribal court) a man put his children on sale at Rs 1.6 million.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X