అసలే జర్నలిస్ట్.. తన పెళ్ళి డిఫరెంట్‌గా ఉండాలనుకున్నాడు..

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన ఓ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నో పెళ్లిళ్లు జరుగుతుంటాయి కానీ ఈ పెళ్లి మాత్రం కాస్త స్పెషలే. ఎందుకంటే, ఈ పెళ్లి ఓ టీవీ చానల్లో రిపోర్టర్‌‌గా పనిచేస్తోన్న బుఖారీ అనే జర్నలిస్ట్‌ది.

జర్నలిస్ట్ పెళ్లయితే మాత్రం మరీ అంత ప్రత్యేకత ఏముంటుంది అనేదే కదా మీ డౌటు. ఇక్కడే ఉంది మరి అసలు కథ. ఇంకా అర్థం కాలేదా.. తన ప్రొఫెషన్‌లో భాగంగా ఎన్నో ఈవెంట్లు కవర్ చేసే బుఖారీ చివరికి తన పెళ్లికి తానే 'లైవ్ కవరేజి' ఇచ్చేశాడు.

అందరి పెళ్లిళ్లకంటే తన పెళ్లి కాస్త డిఫరెంట్‌గా ఉండాలనుకున్నాడు బుఖారీ. అతడికి ఓ వింత ఆలోచన వచ్చింది. అంతే- అమలులో పెట్టేశాడు. పెళ్లివేడుకు ప్రారంభమై బంధువులంతా ఫుల్ జోష్‌లో ఉన్నారు. పెళ్లి కూతురు తరపువాళ్ల కూడా పెళ్లి మండపానికి చేరుకున్నారు.

Pakistani reporter covers his own wedding on TV, interviews wife and parents

అంతలో పెళ్లి కొడుకు బుఖారీ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. పెళ్లి డ్రస్‌లోనే తాను పనిచేస్తున్న చానల్ లోగో ఉన్న మైక్ తీసుకుని కెమెరామెన్‌‌తో కలిసి మండపానికి వచ్చాడు. వచ్చీ రావడంతోనే లైవ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్న వాళ్లంతా మొదట షాక్ అయ్యారు.

వాళ్లంతా ఆ షాక్‌లో ఉండగానే జర్నలిస్ట్ బుఖారీ తన పెళ్లి విశేషాలను వివరించడం మొదలెట్టాడు. పెళ్లి మండపంలో ఉన్న తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడించేశాడు. చివరికి కాబోయే భార్యను కూడా ఇంటర్వ్యూ చేశాడు. తన తండ్రి, అత్త, తల్లిని లైవ్‌లో మాట్లాడించాడు.

తన పెళ్లిపై వారందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాడు. అంతా అయ్యాక చివరగా ఎండ్ పీటూసీ చెప్పి.. లైవ్ ముగించి ఆ తరువాత పెళ్లి పీటలెక్కాడు. మనోడి పెళ్లికి సంబంధించిన విశేషాలన్నీ లోకల్ చానల్‌లో లైవ్ కూడా ఇచ్చారు.

ఇప్పుడీ జర్నలిస్ట్ బుఖారీ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బుఖారీపై కొంతమంది ప్రశంసల జల్లు కురిపిస్తుంటే... మరికొందరేమో.. 'జర్నలిస్ట్ బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు.. ఇది కాస్త ఓవర్‌గా లేదూ..' అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Pakistani reporter has taken journalism to a new level by reporting his own wedding. Hanan Bukhari, a news reporter for local TV channel City 41, is making headlines for taking his job too seriously and reporting live from his own wedding ceremony, surprising friends and viewers. In the video, Bukhari can be seen holding a microphone as if he is on duty but he is dressed in traditional wedding attire.“My parents and I are very happy today. Because it is a love marriage, my wife is happy, and so are her family members. My parents who made all wedding arrangements are joyful to make this day come true,” Bukhari says on camera. He also interviewed his family on his big day.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి