పాకిస్తానోడు మనల్ని మెచ్చుకుంటుంటే ఆ కిక్కే వేరప్పా: పొగడ్తల సునామీ
India Pakistan War: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారానికి దిగింది భారత్. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను పెంచిపోషిస్తోన్న పాకిస్తాన్‌పై మిస్సైళ్లతో దాడి చేసింది.
పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగాలపై పాతుకుపోయిన ఉగ్రవాద సంస్థలను నామరూపాల్లేకుండా చేసింది భారత్. ఈ దాడిలో జైషె మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు భారీగా నష్టపోయాయి. అవి నిర్వహిస్తోన్న శిబిరాలు ధ్వంసం అయ్యాయి.

బహవాల్‌పూర్ అహ్మద్‌పూర్ ఈస్ట్‌లో సుభాన్ మసీద్ ప్రాంతంలో చాలాకాలం నుంచీ కొనసాగుతూ వస్తోన్న జైషె మహ్మద్ సంస్థకు చెందిన నాలుగు ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం అయ్యాయి. కొట్లి, మర్కజ్ సుభాన్ అల్లా, మర్కజ్ తైబా, సర్జల్, టెహ్రా కలాన్, మురిడ్కె, మెహమూనా జోయా, సియాల్‌కోట్, సయ్యద్నా బిలాల్ క్యాంప్‌లో గల జైషె మహ్మద్ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి.
మర్కాజ్ అహ్లె హదిల్, బర్నాలా, మర్కజ్ అబ్బాస్, సవాయ్ నల్లా క్యాంప్, ముజఫరాబాద్‌లల్లో లష్కరే తొయిబా, మస్కర్ రాహీల్ షాహిద్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద క్యాంపులు నామరూపాల్లేకుండా పోయాయి. వీటికి సంబంధించిన వీడియోలను సైతం భారత ఆర్మీ విడుదల చేసింది.
ఈ ఆక్యురేట్ దాడి పట్ల పాకిస్తాన్ యువత సైతం ప్రశంసించకుండా ఉండలేకపోతోంది. చిక్కటి చీకట్లో సైతం భారత వైమానిక బలగాలు 95 శాతం లక్ష్యాలను ఛేదించగలిగాయంటూ అభినందిస్తోంది. అదే సమయంలో తమ దేశ ఆర్మీ వైఫల్యాన్ని ఎండగడుతోంది. లోపాలను ఎత్తి చూపుతోంది. పాకిస్తాన్‌కు చెందిన యువత సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తోంది.
బుధవారం తెల్లవారు జామున పాకిస్తాన్‌పై భారత్ 24 మిస్సైళ్లను సంధించిందని, అవన్నీ కూడా చాలా అక్యురేట్‌గా లక్ష్యాన్ని ఛేదించాయని పాకిస్తాన్‌కు చెందిన ఓ యువకుడు ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇందులో పాకిస్తాన్ ఆర్మీ ఏ ఒక్క మిస్సైల్‌ను ఇంటర్‌సెప్ట్ చేయలేకపోయిందని, ఒక్క దాన్ని కూడా అడ్డుకోలేకపోయామని, ఇది తమ దేశ రక్షణ వ్యవస్థ వైఫల్యమని వ్యాఖ్యానించాడు.
ఉగ్రవాదుల ఇళ్లల్లో దూరి కొడతామంటూ భారత్ ఎప్పుడూ చెబుతుంటుందని, ఇప్పుడు అదే చేసిందని భారత ఆర్మీని పొగడ్తలతో ముంచెత్తాడు. 24 మిస్సైళ్లు మీద పడ్డా కనీసం ఒక్క దాన్నయినా అడ్డుకోలేకపోయామని పేర్కొన్నాడు. పాకిస్తాన్‌లో ఉంటూ భారత్‌ను పొగడుతున్నాడంటూ తనను తప్పుపట్టినా సరే.. వాస్తవాన్ని అంగీకరించక తప్పదని అన్నాడు.
వందలు, వేల సంఖ్యలో మిస్సైళ్లు ఇజ్రాయెల్‌పై సంధించినప్పటికీ అందులో కొన్ని మాత్రమే టార్గెట్‌కు చేరుకుంటాయని, మిగిలిన వాటిని ఆ దేశ రక్షణ వ్యవస్థ నేలకూల్చుతుందని ఆ యువకుడు గుర్తు చేశాడు. ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ అంత బలంగా ఉంటుందని, ఈ విషయంలో పాక్ అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నాడు.
భారత్.. ఉగ్రవాదల క్యాంపులను టార్గెట్ చేసింది కాబట్టి బతికిపోయామని, జనావాసాల మీదో లేక ఏదైనా నగరం మీదో మిస్సైళ్లను సంధించివుంటే ప్రాణాలు పోయేవని అన్నాడు. అదే సమయంలో సోషల్ మీడియా ఆధారంగా భారత్‌పై బురదజల్లే ప్రయత్నాలకు పాకిస్తాన్ తెరతీసిందని తప్పుపట్టాడు.
మరో యువకుడు పెషావర్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన కొన్ని వీడియోలను షేర్ చేశాడు. భారత్ దాడులను దృష్టిలో పెట్టుకుని ఇస్లామాబాద్‌కు వెళ్లాల్సిన విమానాన్ని పెషావర్‌కు మళ్లించారని పేర్కొన్నాడు. ఎయిర్ పోర్ట్ మొత్తం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఇక్కడ అంతా సవ్యంగా ఉన్నట్లు పాక్ మీడియా గానీ, అధికారులు గానీ చెప్పడంలో అర్థం లేదని వ్యాఖ్యానించాడు.












Click it and Unblock the Notifications