భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..

సిక్కుల ప్రథమ గురువు, సిక్కు మత స్థాపకుడు గురు నానక్.. పాకిస్థాన్‌ లోని నాన్‌ కానా సాహిబ్ అనే ప్రాంతంలో జన్మించారు. ఆయన 1469 ఏప్రిల్ 15న రాయ్ భోయ్ డి తల్వండి అనే గ్రామంలో జన్మించారు. ఈ ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్‌ లోని షేఖుపురా జిల్లాలో ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సిక్కు మతాన్ని ఆచరించేవాళ్లు 2.6 కోట్ల మంది ఉన్నట్లు సమాచారం.

అయితే సిక్కుల పవిత్ర స్థలం నాన్ ఖానా సాహిబ్ కు ఏటా భారత్ నుంచి పాకిస్థాన్ కు లక్షలాది మంది భక్తులు తరలి వెళ్లి గురునానక్ పుట్టిన రోజునాడు ఆయన పుట్టిన ప్రదేశాన్ని దర్శించుకుంటారు. అయితే ఈ ఏడాది పవల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్థాన్- భారత్ మధ్య సంబంధాలు మరింతగా క్షీణించాయి. దీంతో ఈ ఏడాది సిక్కు మతస్థుల్లో ఆందోళన నెలకొంది. నాన్ ఖానా సాహిబ్ కు తమను అనుమతిస్తారా..? లేదా..? అన్న సందేహం వారిలో నెలకొంది. అయితే తాజాగా పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్ కు దాదాపు 2 వేల మందికి పైగా సిక్కు మతస్థులకు పాకిస్థాన్ లోని నాన్ ఖానా సాహిబ్ కు వెళ్లేందుకు వీసాలు జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురునానక్ బర్త్ డే సెలబ్రేషన్స్ నవంబర్ 4 నుంచి 13 వరకు జరగనున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి.. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య ప్రయాణం ప్రారంభం కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. పాకిస్థాన్- భారత్ మధ్య సత్సంబంధాలకు ఇదో గుడ్ విల్ గా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

Pakistan s Historic Green Light 2 000 Indian Sikhs Get Visas for Nankana Sahib Darshan Amid Tensions

ఈ మేరకు వీసాలను జారీ చేసినట్లు దిల్లీలోని పాకిస్థాన్ హై కమిషనర్ స్పష్టం చేశారు. నవంబర్ 4 నుంచి 13 తేదీ వరకు జరగనున్న గురుపుర్బ్ ఉత్సవాల్లో భక్తులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. భారత్- పాకిస్థాన్ సరిహద్దుకు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పవిస్థ స్థలానికి ఇరు దేశాల నుంచి వేల మంది భక్తులు రానున్నట్లు అంచనా వేశారు. ఈ యాత్రను శిరోమణి గురుద్వారా పర్బందక్ కమిటీ(SGPC), భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా పర్యవేక్షించనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+